JOBS: ఇండియన్ ఆయిల్ లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. హ్యూమన్ రిసోర్స్, ఎలక్ట్రికల్, T&I, అకౌంట్స్/ఫైనాన్స్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌తో సహా వివిధ ట్రేడ్‌లలో 473 అప్రెంటీస్ ఖాళీల భర్తీకీ దరఖాస్తులు కోరింది. ఫిబ్రవరి1 అన్ లైన్ అప్లికేషన్ చివరితేది.

JOBS: ఇండియన్ ఆయిల్ లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు
New Update

IOCL Recruitment 2024: నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) తీపి కబురు అందించింది. తమ కంపెనీలో ఖాళీగా ఉన్న వివిధ ట్రేడ్‌ల అప్రెంటీస్ ఖాళీలను భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పోస్టులను అనుసరించి టెన్త్ తోపాటు వివిధ సబ్జెక్టులవారిగా డిగ్రీ పాసైన వారు కింద సూచించిన విధంగా అప్లై చేసుకోవాలని సూచించింది.

ఈ మేరకు హ్యూమన్ రిసోర్స్, ఎలక్ట్రికల్, T&I, అకౌంట్స్/ఫైనాన్స్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌తో సహా వివిధ ట్రేడ్‌లలో 473 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయానుంది. ప్రతి ట్రేడ్‌లోని పోస్ట్‌కు అవసరమైన విద్యార్హతలు భిన్నంగా ఉన్నాయి. టెన్త్ అర్హతతోపాటు డిప్లోమా, ఐటీఐ, ఇంజనీరింగ్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు :
ఆసక్తిగల అభ్యర్థులు 2024 ఫిబ్రవరి 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వయో పరిమితి :
2024 జనవరి 12 నాటికి కనీస వయో పరిమితిని 18 సంవత్సరాలు నుంచి గరిష్ట వయోపరిమితి 24 సంవత్సరాలుగా నిర్ణయించింది. అంతేకాకుండా రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఇది కూడా చదవండి : Ayodhya : అయోధ్య వేడుకకు రాని జూ.ఎన్టీయార్ మరికొందరు…

రాత పరీక్ష :
ఆబ్జెక్టివ్ పద్ధతిలో 100 మార్కుల పరీక్షలు నిర్వహించనున్నారు. ఎగ్జామ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏప్రిల్ లేదా మేలో నిర్వహించే అవకాశం ఉంది.

అప్రెంటిస్‌షిప్ శిక్షణ :
అభ్యర్థులు 12 నెలల పాటు అప్రెంటిస్‌షిప్ కోసం శిక్షణ పొందుతారు. ఎంపికైన అప్రెంటీస్‌లు అప్రెంటీస్ చట్టం, 1961/1973 /అప్రెంటీస్ రూల్స్ 1992 (సవరించినట్లు) అండ్ కార్పొరేషన్ మార్గదర్శకాల ప్రకారం అప్రెంటీస్‌లకు నెలకు చెల్లించాల్సిన విధంగా స్టైపెండ్ చెల్లించనున్నారు.

Notification PDF

మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ : iocl.com

#iocl-recruitment #latest-jobs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe