కజకిస్థాన్ లో చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ! భారత్-చైనా మధ్య విబేధాలు కొనసాగుతున్నవేళ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా మంత్రి వాంగ్ యీని కజకిస్థాన్‌లో భేటీ అయ్యారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 24వ శిఖరాగ్ర సదస్సు కజకిస్థాన్ లోని అస్తానాలో ప్రారంభమైంది. ఈ సదస్సులో వారిద్దరు కరచాలనం చేసుకోవటంతో ఆసక్తి నెలకొంది. By Durga Rao 04 Jul 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 24వ శిఖరాగ్ర సమావేశం నిన్న కజకిస్థాన్ లోని అస్తానాలో ప్రారంభమైంది. ఈ సదస్సులో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఆ సదస్సులోనే పాల్గొన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని తో జైశంకర్ సమావేశమైయారు. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరుదేశాల నేతలు సమావేశమవటంతో ఆసక్తి నెలకొంది.ఆ తర్వాత ఇద్దరు కలసి ఫోటో దిగి కరచాలనం చేసుకున్నారు. ఆ సమయంలో సరిహద్దు సమస్యల పరిష్కారంపై ఇరుదేశాల నేతలు కాసేపు చర్చించినట్లు తెలుస్తోంది. #jaishankar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి