జాబిల్లిపై భారత త్రివర్ణ పతకం రెపరెపలాడటంతో దేశమంతా సంబురాలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా ఆనందమే కనిపిస్తోంది. ప్రపంచమంతా మనవైపే చూసింది. యావత్ ప్రపంచం మనల్ని కీర్తిస్తోంది. ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగింది. ఈ క్రమంలో ఐర్లాండ్‌లో ఉన్న టీమిండియా క్రికెటర్లు కూడా చంద్రయాన్-3 విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఐరీష్ జట్టుతో మూడో టీ20 మ్యాచ్‌కు ముందు మన ఆటగాళ్లు టీవీకి అతుక్కుపోయారు. భారతదేశం మొత్తం ఎలాగైతే నరాలు తెగే ఉత్కంఠతో ఈ ప్రయోగం ప్రత్యక్షంగా వీక్షించారో.. అలాగే మన క్రికెటర్లు కూడా టీవీలో లైవ్ చూస్తూ టెన్షన్ టెన్షన్‌గా ఉండిపోయారు. చందమామపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపగానే విజయగర్వంతో ఊగిపోయారు. ఒకరినొకరు హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ట్ పేజీలో పోస్ట్ చేసింది.
పూర్తిగా చదవండి..చంద్రయాన్-3 సక్సెస్‌తో టీమిండియా క్రికెటర్ల సంబరాలు
జాబిల్లిపై భారత త్రివర్ణ పతకం రెపరెపలాడటంతో దేశమంతా సంబురాలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా ఆనందమే కనిపిస్తోంది. ప్రపంచమంతా మనవైపే చూసింది. యావత్ ప్రపంచం మనల్ని కీర్తిస్తోంది. ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగింది. ఈ క్రమంలో ఐర్లాండ్‌లో ఉన్న టీమిండియా క్రికెటర్లు కూడా చంద్రయాన్-3 విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
Translate this News: