CR Rao: ప్రముఖ గణిత శాస్త్ర వేత్త సీఆర్ రావు కన్నుమూత....!

ప్రముఖ భారత అమెరికన్ గణిత శాస్త్రవేత్త క్యాలంపూడి రాధ కృష్ణారావు ఇక లేరు. సీఆర్ రావుగా ప్రసిద్ది చెందిన ఆయన బుధవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 102 ఏండ్లు. స్టాటిస్టిక్స్ విభాగంలో ఆయన విశేషమైన సేవలందించారు. స్టాటిస్టిక్స్ విభాగంలో నోబెల్ బహుమతిగా భావించే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ను ఆయనకు ఇటీవల అందజేశారు. గణిత

author-image
By G Ramu
New Update
CR Rao: ప్రముఖ గణిత శాస్త్ర వేత్త సీఆర్ రావు కన్నుమూత....!

CR Rao: ప్రముఖ భారత అమెరికన్ గణిత శాస్త్రవేత్త క్యాలంపూడి రాధ కృష్ణారావు (Calyampudi Radhakrishna Rao) ఇక లేరు. సీఆర్ రావుగా ప్రసిద్ది చెందిన ఆయన బుధవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 102 ఏండ్లు. స్టాటిస్టిక్స్ విభాగంలో ఆయన విశేషమైన సేవలందించారు. స్టాటిస్టిక్స్ విభాగంలో నోబెల్ బహుమతిగా భావించే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ (International Prize in Statistics) ను ఆయనకు ఇటీవల అందజేశారు.

ఒకప్పటి మద్రాసు ప్రెసిడెన్సి( నేటి కర్ణాటక రాష్ట్రం)లోని బళ్లారిలోని తెలుగు కుటుంబంలో ఆయన జన్మించారు. గూడూరు, నూజీవీడు, నందిగామాలో ఆయన తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆంధ్రయూని వర్సిటీ నుంచి ఆయన ఎంఎస్పీ పట్టా అందుకున్నారు. అనంతరం 1943లో కలకత్తా వర్సిటీలో ఎంఏ స్టాటిస్టిక్స్ చదివారు. కేంబ్రిడ్డి వర్సిటీ(Cambridge University)లో ప్రముఖ ప్రొఫెసర్ ఆర్ఏ ఫిషర్ పర్యవేక్షణలో పీహెచ్ డీ చేశారు.

విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయన కేంబ్రిడ్జిలో ఆంత్రోపాలజికల్ మ్యూజియంలో ఉద్యోగిగా పని చేశారు. ఆ తర్వాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో పలు హోదాల్లో పని చేశారు. జేఎన్ టీయూలో ఫ్రొఫెసర్, నేషనల్ ప్రొఫెసర్, పిట్స్ బర్గ్ వర్సిటీలో ప్రొఫెసర్, ఏబర్లీ వర్సిటీల్లో ప్రొఫెసర్ గా ఆయన పని చేశారు. పెన్సిల్ వీనియా వర్సిటీలో డైరెక్టర్ ఫర్ మల్టీ వేరియట్ ఎనాలసిస్ గా ఆయన సేవలందించారు.

ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ (Indian Statistical Institute)డైరెక్టర్ గా కూడా ఆయన పని చేశారు. 1945లో కోల్ కతాలోని మ్యాథమెటికల్ సొసైటీలో ఆయన రీసెర్చ్ పేపర్ ప్రచురితమైంది. ఆధునిక స్టాటిస్టిక్స్ రంగానికి మార్గం సుగమం చేసిన మూడు ప్రాథమిక ఫలితాలను తన పరిశోధక పత్రంలో ఆయన వెల్లడించారు. ఈ పరిశోధక పత్రానికి గాను ఆయనకు ఇటీవల ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు లభించింది.

Also Read: దిగ్గజ క్రికెటర్ హిత్ స్ట్రీక్ ఇక లేరు…!

Advertisment
Advertisment
తాజా కథనాలు