INDIA Vs Bharat: 'ఇండియా' పేరును రాజ్యాంగం నుంచి తొలగింపు..? బీజేపీ ఏం చేయబోతోంది?

రాజ్యాంగం నుంచి 'ఇండియా' పేరును తొలగించాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్‌ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జీ20 సదస్సులో పాల్గొనే నాయకులకు సెప్టెంబర్ 9న విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఆహ్వాన పత్రిక చర్చనీయాంశంగా మారింది.

New Update
INDIA Vs Bharat: 'ఇండియా' పేరును రాజ్యాంగం నుంచి తొలగింపు..? బీజేపీ ఏం చేయబోతోంది?

Govt might table Bill to remove ‘India’ from Constitution: రాజ్యాంగం నుంచి 'ఇండియా(India)' పేరును తొలగించాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్‌ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జీ20(G20) సదస్సులో పాల్గొనే నాయకులకు సెప్టెంబర్ 9న విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఆహ్వాన పత్రిక చర్చనీయాంశంగా మారింది. ఆహ్వాన పత్రికపై 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'కు బదులు 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని ప్రింట్ చేశారు. ఒక నిమిషం ఏకంగా రాష్ట్రపతి కార్యాలయమే ఇలా ప్రింట్ చేయడాన్ని బట్టి చూస్తే.. కేంద్రం 'ఇండియా' పేరును 'భారత్‌'గా మార్చే ప్రక్రియ ఇప్పటికే మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.

సెప్టెంబర్ 18-22 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం 'ఇండియా(India)' పేరు తొలగింపు ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను సమర్పించే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. INDIAకు భారత్‌గా పేరు మార్చాలని పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో తాజా తీర్మానాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. రాష్ట్రపతి భవన్ (ప్రెసిడెంట్ హౌస్)కు జీ20 సమావేశాల విందు కోసం ప్రెసిడెంట్‌ ఆఫ్ భారత్‌ పేరుతో ఆహ్వానాలు పంపిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేసింది.

Also Read: ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై సుప్రీం జోక్యం చేసుకోవాలి.. సీజేఐకి 262 మంది ప్రముఖుల లేఖ.!!

కాంగ్రెస్‌ ఎదురుదాడి:
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ట్విట్టర్‌లో ఈ విధంగా పోస్ట్ చేశారు. 'ఈ వార్త నిజంగా నిజం. రాష్ట్రపతి భవన్ సెప్టెంబర్ 9న 'భారత రాష్ట్రపతి'కి బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్(President of bharat)' పేరుతో జీ20 విందుకు ఆహ్వానాన్ని పంపింది.' రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్‌లో ఉన్న 'యూనియన్ ఆఫ్ స్టేట్స్' కూడా దాడికి గురవుతోందని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ అన్నారు.


అటు 'భారత్'‌ను ఉపయోగించడాన్ని సమర్థిస్తూ బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా 'దేశ గౌరవం, గర్వానికి సంబంధించిన ప్రతి అంశంపై కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత అభ్యంతరం?' అని ప్రశ్నించారు.

దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్:
దేశం పేరును భారత్‌గా మార్చాలనేది బీజేపీ చిరకాల డిమాండ్. గతేడాది డిసెంబర్‌లో గుజరాత్‌-ఆనంద్‌కు చెందిన బీజేపీ ఎంపీ మితేష్ పటేల్ ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. 1949లో రాజ్యాంగ సభ ద్వారా చర్చించబడినట్లుగా మన దేశానికి 'భారత్' లేదా 'భారత్వర్ష్' గా పేరు మార్చడం గురించి లోక్‌సభలో ఒక ప్రశ్నను లేవనెత్తారు.

Also read: కాలు జారి కిందపడిన సీఎం..పైకి లేపిన భద్రతా సిబ్బంది..!!

Advertisment
తాజా కథనాలు