INDvsAUS: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించిన రాహుల్ సేన మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 399 పరుగులు చేసింది. అనంతరం 400 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ జట్టుకు ఆదిలోనే ప్రసిద్ధ్ కృష్ణ గట్టి షాక్ ఇచ్చాడు. అతడు వేసిన తొలి ఓవర్లోనే మాథ్యూ షార్ట్, కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేశాడు. తర్వాత వర్షం మ్యాచుకు అంతరాయం కలిగించడంతో కాసేపు ఆట ఆగిపోయింది. అయితే వరుణుడు కరుణించడంతో మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించారు అంపైర్లు. దీంతో ఆస్ట్రేలియా జట్టు టార్గెట్ 317 పరుగులుగా నిర్ణయించారు. బ్యాటింగ్‌కు వచ్చిన కంగారు జట్టును భారత బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేశారు. దాంతో ఆస్ట్రేలియా 217 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అశ్విన్ 3, జడేజా 3, ప్రసిద్ధ్ 2 వికెట్లు తీశారు.
పూర్తిగా చదవండి..INDvsAUS: రెండో వన్డేలో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. 2-0తో సిరీస్ కైవసం
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించిన రాహుల్ సేన మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 399 పరుగులు చేసింది. అనంతరం 400 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ జట్టుకు ఆదిలోనే ప్రసిద్ధ్ కృష్ణ గట్టి షాక్ ఇచ్చాడు.

Translate this News: