India vs srilanka: శ్రీలంకపై భారత్‌ గ్రాండ్‌ విక్టరీ.. చుట్టేసిన కుల్దీప్..!

ఆసియా కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. నిన్న పాకిస్థాన్ పై భారీ విజయం సాధించిన భారత్... ఇవాళ శ్రీలంకతో స్వల్ప స్కోర్ల మ్యాచ్ లోనూ గెలుపొందింది. ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

New Update
India vs srilanka: శ్రీలంకపై భారత్‌ గ్రాండ్‌ విక్టరీ.. చుట్టేసిన కుల్దీప్..!

ఓడిపోతాం అని అంతా అనుకున్నాం. 214 పరుగుల విజయ లక్ష్యాన్ని ఈజీగా శ్రీలంక ఛేజ్‌ చేస్తుందని అంతా భావించారు. అయితే స్పిన్నర్‌ కుల్దీప్ శ్రీలంక భరతం పట్టాడు. నాలుగు వికెట్లతో శ్రీలంక బ్యాటర్ల వెన్ను విరిచాడు. దీంతో మ్యాచ్‌ ఇండియా వశమైంది. సూపర్-4 మ్యాచ్‍లో శ్రీలంకపై భారత్ అద్భుత విజయం సాధించింది. కొలంబోలో జరిగిన మ్యాచ్‍లో 41 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. దీంతో ఆసియాకప్ టోర్నీ ఫైనల్‍కు చేరింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (53) అర్ధ శతకంతో రాణించగా.. కేఎల్ రాహుల్ (39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో దినుత్ వెల్లలాగే ఐదు వికెట్లతో అదరగొట్టగా.. చరిత్ అసలంక నాలుగు వికెట్లతో రాణించాడు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించటంతో శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. భారత స్పిన్నర్ కుల్‍దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో అద్భుత ప్రదర్శన చేయగా.. జస్‍ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, పాండ్యా చెరో వికెట్ తీశారు.

శ్రీలంక బ్యాటింగ్:

➼ పాతుమ్ నిస్సాంక 6(7)

➼ దిముత్ కరుణరత్నే 2(17)

➼ కుసాల్ మెండిస్* 15(16)

➼ సదీర సమరవిక్రమ 17(31)

➼ చరిత్ అసలంక 22(35)

➼ ధనంజయ డి సిల్వా 41(66)

➼ దాసున్ షనక 9(13)

➼ దునిత్ వెల్లలాగే* 41(44)

➼ మహేశ్ తీక్షణ* 2(11)

భారత బౌలింగ్:

➼ జస్ప్రీత్ బుమ్రా 2/30(7)

➼ మహ్మద్ సిరాజ్ 1/17(5)

➼ హార్దిక్ పాండ్యా 0/12(4)

➼ కుల్దీప్ యాదవ్ 4/43(9)

➼ రవీంద్ర జడేజా 2/33(10)

➼ అక్షర్ పటేల్ 0/29(5)

సత్తా చాటుతోన్న కుల్దీప్ యాదవ్‌:
గత మ్యాచ్‌లోనూ కుల్దీప్‌ సత్తా చాటాడు. ఐదు వికెట్లతో పాక్‌ వెన్ను విరిచాడు. ఇప్పుడు శ్రీలంకపైనా అదరగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డులు వచ్చి చేరాయి. సచిన్ టెండూల్కర్, షాహిది అఫ్రిది రికార్డులను బ్రేక్ చేశాడు. వన్డేల్లో వేగంగా 10 వేలు పరుగులు చేరుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకోగా.. రోహిత్ శర్మ 241 ఇన్నింగ్స్‌ల్లో చేరుకున్నాడు. సచిన్ (259 ఇన్నింగ్స్‌లు)ను దాటేశాడు. ఆ తరువాతి స్థానంలో సౌరవ్ గంగూలీ (263), రికీ పాంటింగ్ (266) ఉన్నారు. పది వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు. హిట్‌మ్యాన్‌ సిక్సర్‌తో 10 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.

ALSO READ: హర్షా భోగ్లే మొదటి పే చెక్‌ ఫొటో వైరల్‌.. మీరు తోపు సర్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు