INDIA vs NDA: ఎన్డీయే, INDIAలో ఎవరి బలాబలాలు ఎంత..? ఎవరిది పైచేయి..నెక్ట్స్ ఈక్వేషన్స్ ఏంటి..? ఎన్డీయే, INDIA మిత్రపక్షాల భేటీలు ముగిశాయి. ఎన్డీయేకి 38పార్టీల మద్దతుండగా.. INDIAకి 26పార్టీల సపోర్ట్ ఉంది. ఎన్డీయేకి ప్రస్తుతం 332మంది ఎంపీల బలముండగా.. INDIAకి 114ఎంపీల బలముంది. By Trinath 19 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి భేటీలు ముగిశాయి.. పోటాపోటిగా జరిగిన బీజేపీ, యాంటీ-బీజేపీ మిత్రపక్షాల తొలి రౌండ్ మీటింగ్‌లు కాన్ఫిడెన్స్‌తో, గెలుపు ధీమాతో, భవిష్యత్ తమదేనన్న ఆశతో ముగిశాయి. ఎన్డీయే మిత్రపక్షాల భేటీకి 38పార్టీలు హాజరవగా.. INDIA(ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్)మిత్రపక్షాల భేటీకి 26పార్టీలు హాజరయ్యాయి. ప్రస్తుతం ఎన్డీయే,INDIA గూటిలో ఉన్న పార్టీలు వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు అందులోనే ఉంటాయా.. జంప్‌లు చేస్తాయా..కొత్తగా ఎవరైనా యాడ్ అవుతారా అన్నది తర్వాతి విషయం. ప్రస్తుతమున్న బలాబలాల ప్రకారం ఎవరిది పైచేయి..? మోదీ(ఫైల్), రాహుల్(ఫైల్) INDIA బలమెంత? యూపీఏ(UPA) నుంచి INDIAగా పేరు మార్చుకున్న యాంటి-బీజేపీ పార్టీలకు ప్రస్తుతం 114ఎంపీల బలముంది. INDIAవైపు నిలుస్తున్న 26పార్టీల్లో 11పార్టీలు అధికారంలో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలంటే 272ఎంపీ సీట్ల మ్యాజిక్ మార్క్‌ని దాటాల్సి ఉంటుంది. అయితే 2019 జనరల్ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్‌కి 50కంటే తక్కువ సీట్లు రావడం కొంపముంచింది. కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. రాహుల్ జోడోయాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలే అందుకు సాక్ష్యంగా చూపిస్తున్నారు కాంగ్రెస్ మద్దతుదారులు. అయితే కేవలం ఒక్క రాష్ట్రంలో గెలిచినంత మాత్రానా కాంగ్రెస్ క్రేజీ పెరిగినట్టు కాదన్నది మరికొందరి వాదన. నిజానికి కర్ణాటకలో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం షరా మాములే..ఆ సైకిల్‌లో భాగంగానే కాంగ్రెస్ గెలిచిందంటున్నారు బీజేపీ సపోర్టర్స్. INDIAకూటమిలో ప్రస్తుతానికి 26పార్టీలు ఉన్నా.. కాంగ్రెస్ సత్తా చూపకపోతే ఏం ప్రయోజనం ఉండదు. మరోవైపు INDIAకూటమిలో ఉన్న టీఎంసీ(TMC), DMK ఎంపీ సీట్లు కూడా ఈ ఫ్రంట్‌కి అడ్వేంటేజ్. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న DMKకి 24ఎంపీ సీట్లు, బెంగాల్‌లో రూలింగ్‌లో ఉన్న TMCకి 23ఎంపీ సీట్లు ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు ఇదే దిశగా సీట్లు సాధిస్తాయని ఇప్పటికైతే చెప్పలేం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే మాత్రం ఈ రెండు పార్టీలు తమ రాష్ట్రాల్లో సత్తా చాటుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ కూడా సీట్ల సంఖ్యను పెంచుకుంటుందని చెబుతున్నారు. అటు బీహార్ పార్టీ జనతా దళ్ యునైటెడ్(JDU)కు ప్రస్తుతం 16ఎంపీలు ఉండగా.. వచ్చే జనరల్ ఎలక్షన్స్‌లో భారీగా ఎంపీ స్థానాలు గెలుస్తామని నితీశ్‌కుమార్ ధీమాగా ఉన్నారు. NDA బలమెంత? ఇటు బీజేపీ మిత్రపక్షాల కూటమి ఎన్డీయే సీట్ల సంఖ్యలోనూ, మద్దతిస్తున్న పార్టీల సంఖ్యలోనూ INDIAకూటమి కంటే చాలా ముందుంది. ప్రస్తుతం NDAకి 332ఎంపీల బలముంది. అందులో బీజేపీకే 300కు పైగా ఎంపీలున్నారు. 38పార్టీల సపోర్ట్ ఉంది. శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గం నుంచి 13మంది ఎంపీలు ఉన్నారు. అయితే కూటమిలో ఉన్న చాలా పార్టీలకు అసలు ఎంపీల సంఖ్యనే లేదు. అంటే జీరో అన్నమాట. ఇది ఎన్డీయేని కలవర పెట్టే అంశం. సింగిల్ హ్యాండిడ్‌గా బీజేపీ గెలవాల్సి ఉంది. అంటే గతంలో లాగానే ప్రచార భారమంతా మోదీపైనే పడనుంది. నిజానికి నితీశ్ కుమార్ పార్టీ 2019లో ఎన్డీయేకి అండగా ఉంది. తర్వాత మారిన సమీకరణలతో బీజేపీతో విభేదించి బయటకు వచ్చింది. ఇప్పుడు INDIAపక్షాన ఉంది. ఇలా పాత మిత్రులు కొందరు దూరమైతే..కొత్త మిత్రులు కొందరు ఎన్డీయేలో వచ్చి చేరారు. అయితే వీళ్లెవరికీ ప్రస్తుతమైతే ఎంపీల బలం లేదు. తమ రాష్ట్రాల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వీళ్లంతా ఎంపీల ఖాతాను ఓపెన్ చేసే అవకాశముంది. కానీ ఒకటి రెండు ఎంపీ సీట్లతో బీజేపీకి పెద్ద లాభం చేకురదన్నది విశ్లేషకులు మాట. సోలో పెర్ఫమెన్స్‌పైనే బీజేపీ ఆధారపడాల్సి ఉంటుందన్నది వాళ్ల వాదన. నెక్ట్స్ ఈక్వేషన్స్ ఏంటి? ప్రస్తుతానికి ఎన్డీయే, INDIAకి మద్దతుగా ఉన్న పార్టీలు 2024జనరల్ ఎలక్షన్స్ వరకు అదే గూటిలో ఉంటాయా అంటే చెప్పడం కష్టమే..రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో తలలు పండిన రాజకీయ విశ్లేషకులకు సైతం అంచనా వేయలేరు. అటు ఏ పక్షానా నిలవకుండా ఉన్న వైసీపీ, బీఆర్‌ఎస్ లాంటీ పార్టీలు తర్వాత ఏటు నిలుస్తాయో ఇప్పటికైతే స్పష్టంగా చెప్పలేం. ఈ రెండు పార్టీలకు భారీగా ఎంపీలున్నారు. వైసీపీకి ఏకంగా 22మంది ఎంపీల బలముంది. ఇటు బీఆర్‌ఎస్‌కు 9మంది ఎంపీలున్నారు. వచ్చే జనరల్ ఎలక్షన్స్‌లోనూ ఇవి రిపీట్ అవుతాయో లేదో తెలియదు. అయితే చివరి వరకు ఈ రెండు పార్టీలు ఏ గూటికి చేరే అవకాశాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితాల తర్వాత అప్పటి పరిణామాలు, పరిస్థితులకు అనుగుణంగా ఈ రెండు పార్టీలు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి