IND vs AUS World Cup 2023 Match Updates: వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా(IND vs Aus) మధ్య జరుగుతున్న తొలి పోరులో టీమిండియాకు వరస షాక్‌లు ఇస్తోంది ఆసిస్ టీమ్. జస్ట్ రెండు ఓవర్లకే 3 వికెట్లు సమర్పించుకుంది టీమిండియా. ఔట్ అయిన ముగ్గురు బ్యాట్స్‌మెన్ జీరో స్కోర్ చేయడం టీమ్‌ను మరింత కష్టాలపాలు చేసింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (0) తాను ఆడిన తొలి బంతికే ఔట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లో నాలుగో బంతికి షాట్‌కి ట్రై చేయగా.. స్లిప్‌లో కామెరూన్ గ్రీన్ క్యాచ్క పట్టాడు. దాంతో ఇషాన్ పెవిలియన్ బాట పట్టాడు.
ఇషాన్ తరువాత వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మది కూడా అదే పరిస్థితి. హేజిల్‌వుడ్ వేసిన 1.3 బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు హిట్ మ్యాన్. రివ్యూ తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. మొత్తానికి ఖాతా తెరవకుండానే.. రోహిత్ వెనుదిరగడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇక మూడో వికెట్‌గా శ్రేయాస్ అయ్యర్ కూడా డకౌట్ అయ్యాడు. షాట్ కొట్టబోయే.. వార్నర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో కేవలం 2 ఓవర్లకే భారత్ మూడు వికెట్లు సమర్పించుకుని.. వరల్డ్‌కప్ టోర్నీలో తొలి మ్యాచ్‌లో కష్టాలు కొని తెచ్చుకుంది.
వన్డే ప్రపంచ కప్ ట్రోఫీలో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ టీమ్ 49.3 ఓవర్లలో 199 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 200 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే తడబాటుకు గురై.. వరుస వికెట్లు సమర్పించుకుంటుంది. ప్రస్తుతం క్రీజ్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా స్కోర్ 33-3/11 గా ఉంది. కేఎల్ రాహుల్ 12 పరుగులు, కోహ్లీ 18 పరుగులతో ఆచితూచి ఆడుతున్నారు.
Also Read:
ఎదురుతిరగడంతో యువతిని కాల్చిన కిరాతకులు..ఇజ్రాయెల్‌లో ఇంత దారుణమా..!
Bandla Ganesh: కూకట్‌పల్లి టికెట్ నాకే..బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..!