భారత్-యూకే మధ్య సంబంధాలు చాలా గొప్పవి: జైశంకర్!

'భారత్‌-యూకే బంధానికి అపారమైన సామర్థ్యం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ అన్నారు. భారత్ పర్యటనకు వచ్చిన  బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ ఢిల్లీలో  జైశంకర్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యం, రక్షణ, నూతన సాంకేతికతలపై సమావేశంలో ఇరువురు చర్చలు జరిపారు.

New Update
భారత్-యూకే మధ్య సంబంధాలు చాలా గొప్పవి: జైశంకర్!

'భారత్‌-యూకే బంధానికి అపారమైన సామర్థ్యం ఉంది' అని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ అన్నారు. భారత్ పర్యటనకు వచ్చిన  బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ ఢిల్లీలో  జైశంకర్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యం, రక్షణ, నూతన సాంకేతికతలపై ఇరువరు చర్చలు జరిపారు.

అనంతరం విలేకరుల సమావేశంలో ఇరుదేశాల విదేశాంగ మంత్రలు మాట్లాడారు.భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరుగాంచిందని డేవిడ్ లామీ అన్నారు.అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో కూడా ఒకటని ఆయన కొనియాడారు.
ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి భారతదేశం  UK కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని జైశంకర్ పేర్కొన్నారు. భారత్, బ్రిటన్ మధ్య సంబంధాలకు అపారమైన సామర్థ్యం ఉందని జైశంకర్ వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు