/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-03T181822.031-jpg.webp)
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా మూడు ఫార్మాట్ల టీమ్ ర్యాంకింగ్స్​ రిలీజ్ చేసింది. తాజా ర్యాంకింగ్స్​లో టెస్టుల్లో 124 రేటింగ్స్​తో ​ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, వన్డే (122 రేటింగ్స్), టీ20 (264 రేటింగ్స్​) ఫార్మాట్లలో భారత్ టాప్ పొజిషన్​లో కొనసాగుతోంది. కాగా, టెస్టుల్లో భారత్ 120 రేటింగ్స్​తో రెండో స్థానంలో ఉంది.అయితే 2021 మే తర్వాత ఆయా టీమ్​ల ప్రదర్శనల ఆధారంగా ఈ ర్యాంకులు దక్కాయి. దాదాపు రెండేళ్ల కాలంలో ఆయా జట్ల విజయాలు, పెర్ఫార్మెన్స్​లు పరిగణలోకి తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. ఈ క్రమంలో గతేడాది జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్​లో భారత్​ను ఢీకొట్టిన ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో నెగ్గడం వల్ల టెస్టుల్లో ఆగ్రస్థానానికి చేరుకుంది.
Australia on 🔝
Reigning World Test Championship winners overtake India to claim the No.1 position on the ICC Men’s Test Team Rankings after the annual update.https://t.co/rl0Ju11fNu
— ICC (@ICC) May 3, 2024
2023-25 డబ్ల్యూటీసీ పాయింట్స్​ టేబుల్​లో మాత్రం టీమ్ఇండియానే అగ్రస్థానంలో ఉంది. 2023- 25 సైకిల్​లో 9 మ్యాచ్​లు ఆడిన టీమ్ఇండియా ఆరింట్లో నెగ్గి, 2 ఓడి, 1 డ్రా చేసుకుంది. ఈ క్రమంలో 68.51 పాయింట్ పర్సెంటేజీతో టాప్ ప్లేస్​లో కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 62.50 పాయింట్ పర్సెంటేజీతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
Follow Us