టమాటా ధరల నియంత్రణకు ఆ రాష్ట్రాల నుండి సేకరణకై కేంద్రం చర్యలు

భారత్‌లో టమాటా ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో సామాన్యులకు పెను భారంగా మారింది. టమాట ధరలను తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం తీసుకోబోయే చర్యలను ప్రకటించింది. ధరల నియంత్రణకు గాను పలురాష్ట్రాల నుండి టమాటాను సేకరించాలని నిర్ణయించింది. ప్రధాన వినియోగ కేంద్రాలలో పంపిణీ చేయడానికి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుండి కొనుగోలు చేయాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ వంటి సహకార సంస్థలను ఆదేశించింది.

టమాటా ధరల నియంత్రణకు ఆ రాష్ట్రాల నుండి సేకరణకై కేంద్రం చర్యలు
New Update

publive-image

ఇక.. దేశ రాజధాని ఢిల్లీ - ఎన్సీఆర్‌లతో సహా పలు ప్రాంతాల్లో రిటైల్ ఔట్ లెట్ల ద్వారా తగ్గింపు ధరలకు విక్రయించబడతాయని సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఢిల్లీతో సహా పలు ప్రాంతాల్లో టమాటా ధరలు కిలోకు రూ.100 కంటే పైగా ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే రూ. 200 తాకింది. పలు రాష్ట్రాల నుండి టమాటాను సేకరించిన అనంతరం జులై 14 నుండి ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతాల్లోని ప్రజలకు రాయితీపై అందించనుంది. పలు ప్రాంతాల్లో అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గి అధిక ధరలకు కారణం అయ్యింది. దీంతో సరుకు రవాణాలో కొంత అంతరాయం ఏర్పడింది.

టమాటా స్టాక్‌ లేక టమాట ధర రికార్డ్ స్థాయికి..

దీంతో టమాటా స్టాక్‌ లేక టమాట ధర రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అత్యధిక ధర పలుకుతున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడి రిటైల్ కేంద్రాల్లో పంపిణీ చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా.. జులై - ఆగస్ట్, అక్టోబర్-నవంబర్ కాలంలో టమాటా ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. జులైలో అకాల వర్షాల కారణంగా దిగుమతి పడిపోయింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని సతారా, నారాయణగాన్, నాసిక్ ప్రాంతాల నుండి గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు టమాటా వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె నుండి టమాటా సరైన పెద్ద పరిమాణంలో వస్తోంది.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

అటు ఉత్తరాదిలోనూ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక నుండి దేశ రాజధాని ఢిల్లీకి వస్తోంది. త్వరలో మహారాష్ట్రలోని నారాయణగావ్, ఔరంగాబాద్ లతో పాటు మధ్యప్రదేశ్ నుండి త్వరలో అదనపు పంట రానుంది. దీంతో త్వరలో టమాటా ధరలు దిగి వచ్చే అవకాశముందని కేంద్రం చెబుతోంది. అంతేకాకుండా టమాట ధరతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటం కోసమే కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టమాటా దిగివస్తోందన్న ఆశతో సామాన్య వినియోగదారులకు కొంత ఊరటను కలిగించిందనే చెప్పాలి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe