భద్రకాళి అమ్మవారికి నైవేద్యంగా 6 రకాల ప్రసాదాలను సమర్పించిన మోదీ

ప్రధాని మోదీ శనివారం వరంగల్‌ జిల్లాలో పర్యటించారు. వారణాసి నుంచి నేరుగా హైదరాబాద్‌ హకీంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి నేరుగా వరంగల్‌ జిల్లాలోని ప్రసిద్దిగాంచిన శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి భద్రకాళీ అమ్మవారంటే ఎంతో భక్తి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

New Update
భద్రకాళి అమ్మవారికి నైవేద్యంగా 6 రకాల ప్రసాదాలను సమర్పించిన మోదీ

వరంగల్‌ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ అమ్మవారిని భారత ప్రధాని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి 6 రకాల ప్రసాదాలను ప్రధాని మోదీ నైవేద్యంగా సమర్పించారు. ఇందులో పులిహోర, చక్ర పొంగలి, రవ్వకేసరి, దద్దోజనం, రవ్వలడ్డు, బెల్లం లడ్డులు ఇలా 6 రకాల ప్రసాదాలను అమ్మవారికి సమర్పించారు. పూజలు చేసిన అనంతరం పండితుల నుంచి ఆశీర్వచనాలను అందుకున్నారు. ప్రధాని మోదీ పదిన్నర నుంచి 10.45 వరకు అంటే 15 నిమిషాల పాటు భద్రకాళీ అమ్మవారి సేవలో తరించారు. ప్రధాని మోదీ వరంగల్ జిల్లా పర్యటన భారీ ఎత్తున జరుగుతుంది.

మోదీ పర్యటన సందర్భంగా భారీ భద్రత

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు వరంగల్‌ జిల్లా కమీషనర్ భారీ భద్రతను ఏర్పాటు చేసారు. దాదాపు మూడు వేల ఐదు వందల మంది పోలీసులతో, ఇరవై కిలోమీటర్ల మేర మోహరించి పహారా కాస్తున్నారు. మరోవైపు ప్రధాని పర్యటన సందర్బంగా నగరంలోని స్కూళ్లకి శనివారం సెలవు ప్రకటించారు.ఇప్పటికే వరంగల్ చేరుకున్న ప్రధాని, భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. మోదీ అమ్మవారి దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులెవర్నీ ఆలయం అనుమతిని నిలిపివేశారు.

వరంగల్‌ జిల్లాను అష్ట దిగ్భందనం చేసిన పోలీసులు

అనంతరం మోదీ దర్శించుకుంటున్న సమయంలో అమ్మవారి ఆలయ దరిదాపుల్లోకి భక్తులు ఎవరు రాకుండా పోలీసులు కట్టుదిట్టం చేసి అన్ని చర్యలు తీసుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వరంగల్‌ జిల్లాను పోలీసులు అష్ట దిగ్భందనం చేసినట్టుగా కనిపిస్తోంది. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొని అటు నుంచి నేరుగా మామునూర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని మామునూర్‌ విమానాశ్రయం అభివృద్ధి పనులను ప్రధాని దగ్గరుండి పరిశీలించనున్నారు. దీంతో మోదీ వరంగల్ పర్యటన ముగుస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు