India at Olympics: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అభిమానులకు ఆదివారం వినోదం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే భారత్ బ్యాగులో ఒకటి కాదు రెండు పతకాలు పడిపోవడం చూడొచ్చు. దీనికి ముందు, జూలై 27 మిశ్రమంగా గడిచింది. ఒకవైపు షూటింగ్‌లో నిరాశాజనక ఆటతీరుతో భారత్ పతకం సాధించే అవకాశాలను కోల్పోయింది. హాకీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల నుంచి భారత్‌కు శుభవార్త వచ్చింది.
ఇదిలా ఉండగా ఈరోజు కచ్చితంగా భారత్ ఆటగాళ్లు మెడల్స్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. మొదట మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ మధ్యాహ్నం 3:30 ఘటనలకు జరుగుతుంది. ఇందులో మను భాకర్ పోటీ పడబోతోంది. టోక్యో ఒలింపిక్స్ లో దురదృష్టం వెంటాడడంతో కన్నీళ్లతో వెనుదిరిగిన ఈ అసమాన క్రీడాకారిణి ఈరోజు కచ్చితంగా మెడల్ గెలుస్తుంది. గోల్డ్ మెడల్ లక్ష్యంగా బరిలో దిగబోతున్న మను భాకర్ కచ్చితంగా మొదటి బంగారు పతాకం భారత్ కు అందిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
India at Olympics: ఇక సాయంత్రం జరిగే ఆర్చరీ పోటీల్లో భారత్ అమ్మాయిలు దేశ ప్రతిష్టను ప్యారిస్ లో చాటిచెప్పబోతున్నారు. ముఖ్యంగా ముగ్గురు అంకిత, భజన్ కౌర్, దీపికా కుమారిసాయంత్రం 6 గంటల సమయంలో జరిగే క్వార్టర్ ఫైనల్స్ లో ఆడుతున్నారు. వీరు ఆ దశ దాటితే తరువాత సెమీఫైనల్స్ లో పోటీపడతారు. సెమీస్ రాత్రి 7 గంటల తరువాత జరుగుతాయి. ఆ తరువాత కాంస్య పతకం కోసం.. అది అయ్యాకా ఫైనల్స్ ఉంటాయి. అంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ మన అమ్మాయిలు ఆర్చరీలో సాధించబోయే విజయం కోసం ఎదురు చూడవచ్చు. వీరి ముగ్గురూ కచ్చితంగా స్వర్ణం తెస్తారని ఆశిస్తున్నారు.
ఇక ఈరోజు అంటే జూలై 28న భారత్ ఆటగాళ్లు పాల్గొనే ఒలింపిక్స్ ఆటల షెడ్యూల్ ఇలా ఉంది.
- 3:30 PM: మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ - మను భాకర్ నుండి పతకం ఆశిస్తున్నారు
- 3:30 PM: పురుషుల టెన్నిస్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. సుమిత్ నాగల్ సింగిల్స్‌లో ఆడనుండగా, రోహన్ బాపన్న, శ్రీరామ్ బాలాజీ డబుల్స్‌లో ఆడనున్నారు.
- 3:50 PM: మహిళల బాక్సింగ్, రౌండ్ ఆఫ్ 32 (50 కిలోలు) - నిఖత్ జరీన్
- 12:45 PM- మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అర్హత- ఎల్వెనిల్ వలరివన్- రమితా జిందాల్
- 12:50 PM- పివి సింధు- మహిళల బ్యాడ్మింటన్ గ్రూప్ స్టేజ్
- 1:06 PM- రోయింగ్ (రిపీచేజ్)- బల్వంత్ పన్వార్
- 2:45 PM- పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అర్హత- సందీప్ సింగ్ - అర్జున్ బాబుటా
- 5:45 PM: మహిళల ఆర్చరీ జట్టు క్వార్టర్ ఫైనల్ - అంకిత, భజన్ కౌర్ మరియు దీపికా కుమారి.
- 7:17 PM తర్వాత- క్వార్టర్ ఫైనల్స్‌లో గెలిస్తే, సెమీ ఫైనల్స్‌లో మహిళల ఆర్చరీ జట్టును చూడవచ్చు.
- 8:18 PM: మహిళల ఆర్చరీ జట్టు కాంస్య పతక మ్యాచ్ - సెమీ-ఫైనల్‌కు చేరిన తర్వాత ఓడిపోతే, మీరు ఆడవలసి ఉంటుంది
- 8:41PM: మహిళల ఆర్చరీ జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్ - అంకిత, భజన్ కౌర్, దీపికా కుమారి ఫైనల్స్‌కు చేరుకుంటే చరిత్ర సృష్టించగలరు.