IND VS AUS: చరిత్ర సృష్టించిన అమ్మాయిలు.. కంగారూలపై తొలిసారి టెస్టు విక్టరీ!

వాంఖడే స్టేడియంలో భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఏకైక టెస్టులో విమెన్స్‌ టీమ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్టు ఫార్మాట్‌లో కంగారూలపై భారత మహిళా జట్టుకు ఇదే తొలి విజయం.

IND VS AUS: చరిత్ర సృష్టించిన అమ్మాయిలు.. కంగారూలపై తొలిసారి టెస్టు విక్టరీ!
New Update

టెస్టుల్లో భారత్‌ అమ్మాయిలు దుమ్ములేపుతున్నారు. ఇటీవలే ఇంగ్లండ్‌ మహిళా జట్టును చిత్తు చేసిన టీమిండియా విమెన్స్‌ జట్టు.. ఈసారి కంగారూలను కంగారెత్తించింది. 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి చారిత్రాత్మక విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో భారత్‌ విమెన్స్‌ టీమ్‌కు ఇదే తొలి విజయం. అటు ఆస్ట్రేలియా మహిళా జట్టు టెస్టుల్లో పది ఏళ్ల తర్వాత తొలిసారి ఓడిపోయింది.

75 పరుగుల విజయ లక్ష్యంతో నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 18.4 ఓవర్లలో 75 రన్స్ చేసి గెలిచింది. రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను రీచ్‌ అయ్యింది. స్మృతి మంధాన, జెమ్మిమా నాటౌట్‌గా నిలిచారు. ఇక ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 219 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. తాహిలా మెగ్రాత్‌ అర్థ సెంచరీ చేసింది. భారత్‌ బౌలర్లలో పూజా నాలుగు వికెట్లతో రాణించింది. స్నేహ్‌ రాణా 3 వికెట్లు తీసింది. ఇక దీప్తీశర్మ రెండు వికెట్లు పడగొట్టింది.

ఇక మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ భారీ స్కోరు చేసింది. 406 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. ఎవరూ సెంచరీ చేయకపోయినా అందరూ తమవంతుగా పరుగులు చేశారు. స్మృతి మంధాన 74 పరుగులు, షఫాలి వర్మ 40 రన్స్ చేసింది. రిచా ఘోష్‌ 52 రన్స్‌తో మెరవగా.. జెమ్మిమా 73 పరుగులు రాబట్టింది. ఇక చివరిలో దీప్తి శర్మ 78 రన్స్‌తో ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇక పూజ సైతం 47 రన్స్‌ చేయడంతో టీమిండియా 400 రన్స్‌ మార్క్‌ను దాటింది.


ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించి ఆస్ట్రేలియా 261 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది. మరోసారి తాహిలా మెగ్రాత్‌ మెరిసింది. 73 రన్స్‌తో టీమిండియా బౌలర్లను దీటుగా ఎదుర్కోంది. ఇటు స్నేహ్‌ రాణా 4 వికెట్లతో ఆస్ట్రేలియా వెన్ను విరిచింది. ఇక టార్గెట్‌ చిన్నది కావడంతో భారత్‌ అమ్మాయిలు అలవోకగా ఛేజ్ చేసి చరిత్ర సృష్టించారు.

Also Read: ‘అదంతా గ్రౌండ్‌లోనే..’ కోహ్లీతో ఫైట్‌ గురించి గంభీర్‌ లవ్‌లీ రిప్లై!

WATCH:

#india-vs-australia #harmanpreet-singh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe