INDIA Alliance Boycott TV news anchors: దేశ వ్యాప్తంగా కొంతమంది న్యూస్ యాంకర్లు హోస్ట్ చేసే షోలను బహిష్కరిస్తున్నట్లు ఇండియా కూటమి ప్రకటించింది. ఈ మేరకు సదరు యాంకర్ల జాబితాను విడుదల చేసింది. తాజాగా జరిగిన ఇండియా బ్లాక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కూటమి నేతలు. ఇదే అంశంపై కాంగ్రెస్ ముఖ్య నాయకుడు కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ.. ''ఇండియా అలయన్స్ పార్టీలు ఏవీ తమ ప్రతినిధులను సదరు యాంకర్ల షోకు పంపొద్దని నిర్ణయించడం జరిగింది'' అని వెల్లడించారు. ఆ యాంకర్లను పేర్లను మీడియా సబ్ గ్రూప్ వెల్లడిస్తుందన్నారు. కేసీ వేణుగోపాల్ ప్రకటించడమే ఆలస్యం అన్నట్లుగా.. మరుసటి రోజుల ఇండియా కూటమి బహిష్కరించిన 14 మంది యాంకర్ల లిస్ట్‌ను రిలీజ్ చేసింది సబ్ కమిటీ. ఈ యాంకర్లు ఎప్పడు ద్వేషపూరిత వార్తలను, చర్చలను నిర్వహిస్తారని, దేశంలో విద్వేషాలను రగిల్చే అంశాలనే ప్రధాన అజెండాగా డిబేట్స్ పెడతారని ఇండియా కూటమి ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే వీరి షోల కు తమ పార్టీల నేతలను పంపబోమని స్పష్టం చేసింది.
ఇండియా కూటమి బహిష్కరించిన యాంకర్ల జాబితాలో ఉన్నది వీరే..
1. అదితి త్యాగి (భారత్ ఎక్స్‌ప్రెస్)
2. అమన్ చోప్రా (నెట్‌వర్క్ 18)
3. అమిష్ దేవగన్ (న్యూస్ 18)
4. ఆనంద్ నరసింహన్ (CNN-న్యూస్ 18)
5. ఆర్నాబ్ గోస్వామి (రిపబ్లిక్ టీవీ)
6. అశోక్ శ్రీవాస్తవ్ (DD న్యూస్)
7. చిత్రా త్రిపాఠి (ఆజ్‌తక్)
8. గౌరవ్ సావంత్ (ఆజ్‌తక్)
9. నవికా కుమార్ (టైమ్స్ నౌ/టైమ్స్ నౌ నవభారత్)
10. ప్రాచీ పరాశర్ (ఇండియా టీవీ)
11. రూబికా లియాఖత్ (భారత్ 24)
12. శివ అరూర్ (ఆజ్‌తక్)
13. సుధీర్ చౌదరి (ఆజ్‌తక్)
14. సుశాంత్ సిన్హా (టైమ్స్ నౌ నవభారత్)
యాంకర్లను బహిష్కరించడంపై కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా కీలక వ్యాఖ్యలు చేశారు. 'ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు, కొన్ని ఛానెల్‌లలో ద్వేషపూరిత దుకాణం నడుపుతారు. గత తొమ్మిదేళ్లుగా ఇదే జరుగుతోంది. వివిధ పార్టీల ప్రతినిధులు ఆ దుకాణాలకు వెళతారు. కొందరు నిపుణులు వెళతారు. మరికొందరు విశ్లేషకులు వెళతారు. కానీ మేమంతా ఆ ద్వేషపూరిత దుకాణానికి కస్టమర్‌లుగా వెళ్తాము. బరువైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ యాంకర్లలో ఎవరికీ మేం వ్యతిరేకం కాదు. ఈ యాంకర్లలో ఎవరినీ మేం ద్వేషించం. కానీ మేము మా దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. అందుకే ఈ ద్వేషపూరిత దుకాణాలను మూసివేయడానికి మా వైపు నుండి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాలని మేము నిర్ణయించాం. అందుకే ఈ ద్వేషపూరిత మార్కెట్‌లకు కస్టమర్‌లుగా వెళ్లకూడదని భారత కూటమిలోని సభ్యులు నిర్ణయించుకున్నారు' అని చెప్పుకొచ్చారు.
ప్రశాంత్ భూషణ్ రియాక్షన్