INDIA Alliance: ఫుల్‌ జోష్‌లో 'ఇండియా' కూటమి.. ఎన్డీయేపై ఫైర్.. కోఆర్డినేషన్ సహా వివిధ కమిటీల నియామకం..

ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) పేరుతో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికల కోసం 14 మంది సభ్యులతో కూడిన కో-ఆర్డినేటర్స్ ప్యానెల్‌ను ప్రకటించింది. ఈ ప్యానెల్‌లో 14 వేర్వేరు పార్టీలకు చెందిన 14 మందిని సభ్యులుగా నియమించారు. ఈ పానెల్‌లో ఏ ఒక్క ముఖ్య నేత కూడా లేకపోవడం విశేషం.

New Update
INDIA Alliance: ఫుల్‌ జోష్‌లో 'ఇండియా' కూటమి.. ఎన్డీయేపై ఫైర్.. కోఆర్డినేషన్ సహా వివిధ కమిటీల నియామకం..

INDIA Alliance: ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) పేరుతో ఎన్డీయేకు వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికల కోసం 14 మంది సభ్యులతో కూడిన కో-ఆర్డినేటర్స్ ప్యానెల్‌ను ప్రకటించింది. ఈ ప్యానెల్‌లో 14 వేర్వేరు పార్టీలకు చెందిన 14 మందిని సభ్యులుగా నియమించారు. ఈ పానెల్‌లో ఏ ఒక్క ముఖ్య నేత కూడా లేకపోవడం విశేషం. పార్టీలో నెంబర్ 2 గానీ, ముఖ్య నేతగా ఉన్న వారిని ప్యానెల్‌లో మెంబర్‌గా నియమించారు. జాతీయ కన్వీనర్‌ రేస్‌లో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ప్యానెల్‌లో లేరు. రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, మల్లికార్జున ఖర్గే, ఉద్ధవ్ థాకరే వంటి ప్రముఖులెవరూ ఈ ప్యానెల్‌లో లేకపోవడం విశేషం.

ఇక నేటి భేటీలో కోఆర్డనేషన్ ప్యానెల్ ఏర్పాటు చేయగా.. అందులో 14 మంది సభ్యులను నియమించారు. ఆ 14 మంది ఎవరనేది ఇప్పుడు చూద్దాం. కోఆర్డినేషన్ ప్యానెల్‌లో సభ్యులు వీరే.

1. KC వేణుగోపాల్ (INC)

2. శరద్ పవార్ (NCP)

3. టీఆర్ బాలు (డీఎంకే)

4. MK స్టాలిన్ (DMK)

5. సంజయ్ రౌత్ (SS)

6. తేజస్వి యాదవ్ (RJD)

7. అభిషేక్ బెనర్జీ (TMC)

8. రాఘవ్ చద్దా (AAP)

9. జావేద్ అలీ ఖాన్ (SP)

10. లాలన్ సింగ్ JD(U)

11. హేమంత్ సోరెన్ (JMM)

12. డి రాజా (సీపీఐ)

13. ఒమన్ అబ్దుల్లా (NC)

14. మెహబూబా ముఫ్తీ (PDP)

ప్రచార కమిటీ సభ్యులు..

1. గుర్దీప్ సింగ్ సప్పల్, INC

2. సంజయ్ ఝా, JD(U)

3. అనిల్ దేశాయ్, SS

4. సంజయ్ యాదవ్, RJD

5. పిసి చాకో, ఎన్‌సిపి

6. చంపై సోరెన్, JMM

7. కిరణ్మోయ్ నందా, ఎస్పీ

8. సంజయ్ సింగ్, AAP

9. అరుణ్ కుమార్, సీపీఐ(ఎం)

10. బినోయ్ విశ్వం, సీపీఐ

11. జస్టిస్ (రిటైర్డ్) హస్నైన్ మసూది, NC

12. షాహిద్ సిద్ధిఖీ, RLD

13. NK ప్రేమచంద్రన్, RSP

14. జి. దేవరాజన్, AIFB

15. రవి రాయ్, సీపీఐ(ఎంఎల్)

16. తిరుమావలన్, VCK

17. KM కాదర్ మొయిదిన్, IUML

18. జోస్ కె. మణి, కెసి(ఎం)

19. TMC (త్వరలో నియమిస్తారు)

సోషల్ మీడియా కోసం వర్కింగ్ గ్రూప్ మెంబర్స్..

1. సుప్రియా శ్రీనాటే, INC

2. సుమిత్ శర్మ, RJD

3. ఆశిష్ యాదవ్, SP

4. రాజీవ్ నిగమ్, SP

5. రాఘవ్ చద్దా, AAP

6. అవిందాని, JMM

7. ఇల్తిజా మెహబూబా, PDP

8. ప్రాంజల్, సీపీఎం

9. డాక్టర్ భాలచంద్రన్ కాంగో, సిపిఐ

10. ఇఫ్రా జా, NC

11. వి అరుణ్ కుమార్, సిపిఐ(ఎంఎల్)

12. TMC (త్వరలో నియమిస్తారు)

మీడియా వర్కింగ్ గ్రూప్..

1. జైరాం రమేష్, INC

2. మనోజ్ ఝా, RJD

3. అరవింద్ సావంత్, SS

4. జితేంద్ర అహ్వాద్, NCP

5. రాఘవ్ చద్దా, AAP

6. రాజీవ్ రంజన్, JD(U)

7. ప్రాంజల్, CPM

8. ఆశిష్ యాదవ్, SP

9. సుప్రియో భట్టాచార్య, JMM

10. అలోక్ కుమార్, JMM

11. మనీష్ కుమార్, JD(U)

12. రాజీవ్ నిగమ్, SP

13. భాలచంద్రన్ కాంగో, సిపిఐ

14. తన్వీర్ సాదిక్, NC

15. ప్రశాంత్ కన్నోజియా

16. నరేన్ ఛటర్జీ, AIFB

17. సుచేతా దే, CPI(ML)

18. మోహిత్ భాన్, PDP

19. TMC (త్వరలో నియామకం)

పరిశోధన వర్కింగ్ గ్రూప్..

1. అమితాబ్ దూబే, INC

2. ప్రొఫెసర్ సుబోధ్ మెహతా, RJD

3. ప్రియాంక చతుర్వేది, SS

4. వందనా చవాన్, NCP

5. కెసి త్యాగి, JD(U)

6. సుదివ్య కుమార్ సోను, JMM

7. జాస్మిన్ షా, AAP

8. అలోక్ రంజన్, SP

9. ఇమ్రాన్ నబీ దార్, NC

10. ఆదిత్య, PDP

11. TMC (త్వరలో నియమించనున్నారు)

సాధ్యమైనంత వరకు కలిసే పోటీ చేయాలి: కూటమి నేతలు

ముంబయిలో జరిగిన విపక్షాల కూటమి మూడో సమావేశంలో పాల్గొన్న 28 పార్టీలు.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వీలైనంత వరకు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రాముఖ్యత, ఆందోళన కలిగించే సమస్యలపై దేశంలోని వివిధ ప్రాంతాలలో కలిసి బహిరంగ ర్యాలీలు నిర్వహించాలని తీర్మానించారు. ఇండియా కూటమిలోని పార్టీలువ ఇవిధ భాషలలో 'జూడేగా భారత్, జీతేగా భారత్' నినాదాన్ని దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.

సామాన్యుల బతుకులు చిధ్రం: ఖర్గే

సామాన్యుల జీవనాన్ని నాశనం చేశారని, నిరుద్యోగ సమస్యలపై ఇండియా కూటమి పోరాడుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రధాని మోదీ ధనవంతులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, పేదలకు ఏమీ చేయలేదని ఆరోపించారు. బడా పారిశ్రామికవేత్తలను ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం పేదల నుంచి దోచుకుంటున్నదని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు ఖర్గే.

ప్రతిపక్ష ఏకమైతే బీజేపీ గెలవడం అసాధ్యం : రాహుల్ గాంధీ

'ప్రతిపక్షం ఏకమైతే బీజేపీకి ఎన్నికల్లో గెలవడం అసాధ్యం' అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీల మధ్య అనుబంధాన్ని పునరుద్ఘాటించారు రాహుల్. ప్రధాని మోదీ భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జీ20 సమావేశానికి ముందే ఈ అంశంపై ప్రధాని తన వైఖరిని స్పష్టం చేయాలని రాహుల్‌ గాంధీ డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం పేదల నుంచి డబ్బును లాగేసుకుని, ధనవంతులకు అందిస్తోందని ఆరోపించారు రాహుల్. ఇండియా కూటమి దేశంలో 60 శాతం జనాభాకు ప్రాతినిథ్యం వహిస్తుందని, పార్టీలన్నీ ఏకమైతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఏమాత్రం సాధ్యం కాదన్నారు రాహుల్ గాంధీ.

ఐదేళ్లు దోచుకోవడం.. ఎన్నికల ముందు నమ్మించడం : ఉద్ధవ్ థాకరే

దేశంలో భయానక వాతావరణాన్ని అంతం చేయాలని ఇండియా కూటమి నిర్ణయించినట్లు శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎల్‌పీజీ ధరలను తగ్గించాలనే కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టారు. 'పాంచ్ సాల్ లూట్.. ఎలక్షన్స్ కే సమయ్ ఛూట్' అని విమర్శించారు. రోజు రోజుకూ ప్రతిపక్ష కూటమి బలపడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం భయపడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని ఇండియా కూటమి నిర్ణయించిందని ఉద్ధవ్‌ తెలిపారు. బడా పారిశ్రామికవేత్తలకు సాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం పేదలను దోచుకుంటోందన్నారు.

అధికారం శాశ్వతం కాదు : నితీష్

నేడు అధికారంలో ఉన్నవారు రేపు ఓడిపోతారని, అధికారి శాశ్వతం కాదన్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. మీడియాను మోదీ ప్రభుత్వం నియంత్రిస్తోందని ఆరోపించారు. విపక్ష కూటమిని చూసి మోదీ ప్రభుత్వం భయపడుతోందని, ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు నితీష్ కుమార్. ఇండియా కూటమి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisment
తాజా కథనాలు