Giorgia Meloni: ప్రధానిని హేళన చేస్తూ పోస్ట్.. జర్నలిస్టుకు భారీ ఫైన్!

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టుకు కోర్టు భారీ ఫైన్ వేసింది. 'మెలోనీ నన్ను భయపెట్టలేరు. మీ హైట్ కేవలం 4 అడుగులు మాత్రమే. మీరు నాకు కనిపించరు’ అని ఎగతాళి చేసిన గిలియా కార్టిసికి రూ.4 లక్షల జరిమానా వేసింది అక్కడి న్యాయస్థానం.

New Update
Giorgia Meloni: ప్రధానిని హేళన చేస్తూ పోస్ట్.. జర్నలిస్టుకు భారీ ఫైన్!

Itali: దేశ ప్రధానిని హేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఓ జర్నలిస్టుకు న్యాయస్థానం బిగ్ షాక్ ఇచ్చింది. ఎత్తు, కలర్, తదితర ఫిజికల్ అంశాలను ఉద్దేశిస్తూ కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంపై ఇటలీ పీఎం జార్జియా మెలోనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు విలేఖరికి 5వేల యూరోలు ఫైన్ విధించింది.

మీ హైట్ కేవలం 1.2 మీటర్లు మాత్రమే..
ఈ మేరకు పూర్తి వివరాల్లోకి వెళితే.. 2021లో జర్నలిస్టు గిలియా కార్టిసి.. మెలోనీ ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. ‘మెలోనీ మీరు నన్ను భయపెట్టలేరు. ఎందుకంటే మీ హైట్ కేవలం 1.2 మీటర్లు మాత్రమే. కాబట్టి మీరు అసలు నాకు కనిపించరు’ అంటూ ఎగతాళి చేశారు. అయితే దీనిపై మెలోనీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారించిన మిలాన్‌ కోర్టు తాజాగా సదరు జర్నలిస్టుకు రూ.4 లక్షల ఫైన్ విధించింది. అయితే ఈ తీర్పుపై కార్టిసి అప్పీల్ చేసుకోవడానికి వీలు కల్పించింది. జర్నలిస్టులను మెలోనీ కోర్టుకు లాగడం ఇదే తొలిసారి కాదు. అక్రమ వలసల విధానాలను లైవ్‌లో విమర్శించినందుకు రోమ్‌ కోర్టు ఒక ప్రముఖ రచయితకు వేయి యూరోలకు పైగా జరిమానా విధించింది. దీంతో మెలోనీ నియంత్రణలను నిరసిస్తూ ఇటలీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ (RAI)జర్నలిస్టులు మే నెలలో సమ్మెకు దిగడం గమనార్హం. కాగా ఒకవేళ కార్టిసి జరిమానా డబ్బులు ఇస్తే వాటిని ఛారిటీకి ఇస్తారని ఆమె తరఫు న్యాయవాది స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు