IND vs AUS T20 Match: నేడు విశాఖలో భారత్, ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్‌

వరల్డ్ కప్ అనంతరం భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ ఇవాళ జరుగనుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ వైజాగ్ వేదికగా జరుగనుంది. వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది.

New Update
IND vs AUS T20 Match: నేడు విశాఖలో భారత్, ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్‌

IND vs AUS T20 Match: వన్డే ప్రపంచకప్‌ 2023 తర్వాత సొంతగడ్డపై భారత్ ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమవుతోంది. 2023 ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్‌ ఆడనుంది. నవంబర్ 23 నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది. వైజాగ్‌ వేదికగా గురువారం భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదటి టీ20 మ్యాచ్‌ జరగనుంది. వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్ఆర్‌ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వైజాగ్‌లో జరగనున్న భారత్, ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్‌కు కట్టుదట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం వద్ద రెండు వేల మంది పోలీసులు ఉండనున్నారు. స్టేడియం వద్ద మూడు అంచెల భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ప్రేక్షకులను సాయంత్రం 5 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తారు. మ్యాచ్ నేపథ్యంలో పలు చోట్ల ట్రాఫిక్‌ మళ్లింపు చేయనున్నారు.

స్టేడియంలో మంగళవారం ఆర్గనైజింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. మ్యాచ్‌ చూసేందుకు స్టేడియంకు వచ్చే వారిని సకాలంలో స్టేడియంలోకి వెళ్లేలా పోలీసులు సహకరించాలని ఏసీఏ కార్యదర్శి ఎస్‌ఆర్‌ గోపినాథ్‌ రెడ్డి సూచించారు. ఫుడ్‌ స్టాళ్లలో నిర్దేశించిన ధరలకే విక్రయించే విధంగా చూస్తామని జీవీఎంసీ కమిషనర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు. స్టేడియం వద్ద ఆరు అంబులెన్స్‌లు, డాక్టర్ల బృందం, పారా మెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.

Also Read:

కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్..

కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు..

Advertisment
తాజా కథనాలు