kavita:కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరను 800 పెంచి 200 తగ్గించడం..ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమేనని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు రాఖీ కానుక కాదన్నారు. సామాన్యుల ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమేనని ఆమె ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ఘాటుగా ట్వీట్ చేశారు.
వంట గ్యాస్ ధరలను ఇష్టానురీతిగా విపరీతంగా పెంచి నామమాత్రంగా 200 తగ్గించి తాము దేశ ప్రజలకు ఎంతో లబ్ధి చేశామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని కవిత విమర్శించారు. ఇక గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఒక ఎల్పీజీ సిలిండర్ పై 800 రూపాయలు పెంచి తాజాగా కేవలం 200 మాత్రమే తగ్గించిందన్నారు ఆమె. మోడీ సర్కార్ కు దేశ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు ఉన్న సిలిండర్ ధరను అమలు చేసి చూపించాలని ఆమె అన్నారు. అయితే దేశ వ్యాప్తంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న వంట గ్యాస్ ధర తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో కేంద్రం గ్యాస్ ధరలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది.
సాధారణ సిలిండర్ ధర 200 తగ్గించిన కేంద్రం ఉజ్వల యోజన కింద ఇచ్చిన సిలిండర్లకు 400 తగ్గించింది. అయితే త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ తగ్గింపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సెటైర్లు కురిపించారు. రెండు నెలల కాలంలో ఇండియా కూటమి కేవలం రెండు సమావేశాలు నిర్వహించిందని.. ఈ రెండు సమావేశాల దెబ్బతో కేంద్రం గ్యాస్ సిలిండర్ పై 200 తగ్గించిందన్నారు. ఇది ఇండియా కూటమి దమ్ము అని ఆమె ట్వీట్ చేశారు.