Owl Photos: గుడ్లగూబ అనగానే గుడ్లగూబలా చూస్తున్నావేంటనే డైలాంగ్ గుర్తుకు వస్తుంది. హిందూమతంలో గుడ్లగూబకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే వాస్తు ప్రకారం కొన్నివస్తువులను పెడితే ఇంటికి, వ్యాపారానికి మంచి జరుగుతుందని కొందరికి నమ్మకం ఉంటుంది. హిందూ దేవుళ్ళలో ప్రతి ఒక్క దేవునికి జంతువులు, పక్షులే వాహనంగా ఉంటుంది. దుర్గా మాత వాహనం సింహం, శివుని వాహనం నంది, గణేశుడి వాహనం ఎలుక ఇలా ఒక్కో దేవునికి ఒక వాహనం ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. ఇంట్లో, కార్యాలయంలో గుడ్లగూబ బొమ్మ, విగ్రహాన్ని ఇంట్లో ఉంచాలా..? లేదా..? అనేది చాలామందికి డౌట్‌గా ఉంటుంది. గుడ్లగూబను శుభప్రదంగా భావిస్తారు, మరికొందరు అశుభంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం అయితే గుడ్లగూబను శుభానికి చిహ్నంగా భావిస్తున్నారు. ఈ చిత్రాలను పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి..? వాస్తు శాస్త్రం ఏమి చెబుతుంది..? దీని ఇప్పుడు కొన్ని వియాలు తెలుసుకుందాం.
ఇంట్లో గుడ్లగూబ ఫొటోలు ఉంటే:
- గుడ్లగూబలకు రోమన్ నాగరికతలో, జపాన్‌లోనూ ప్రత్యేక స్థానం ఉంది. దీనిని వివిధ మతాలలో విభిన్న నమ్మకాలను కలిగి ఉంటాయి. ఈ పక్షి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో జరిగే ప్రమాదాల సమాచారం ఇస్తుందని చెబుతున్నారు.
- గుడ్లగూబల ఫొటోలు ఉంటే లక్ష్మీ దేవి సంతోషించి ఆమె ఆశీర్వాదాలు ఇస్తుందని వాస్తు నిపుణులు చెబుతారు. వాస్తు దోషాలను తొలగిస్తుంది.స్టడీ టేబుల్,ఆఫీసులో గుడ్లగూబ చిత్రాన్ని ఉంచితే.. సంపదను పొందుతారని నమ్ముతారు.
- గుడ్లగూబ ముఖాన్ని ఇంటి ప్రధాన ద్వారం వైపు పెట్టాలి, కుటుంబానికి ఐశ్వర్యం, సుఖసంతోషాలు చేకూరాలంటే ఇంట్లో గుడ్లగూబ బొమ్మ ఉండాల్సిందే. కానీ దానిని సరైన దిశలో..నియమాల ప్రకారం పెట్టినప్పుపుడే ఇది కుదురుతుంది.
- ఆఫీస్, ఇంట్లో గుడ్లగూబ చిత్రాలను పెట్టుకుంటే నరదృష్టి తొలగిపోతుంది. ఇంట్లో గుడ్లగూబను అందరికీ కనిపించే ప్రదేశంలో ఉంచాలని పండితులు చెబుతున్నారు.
- వాస్తు నిపుణుల ప్రకారం.. గుడ్లగూబను ఆఫీస్‌లో పనిచేసే దగ్గరలో కుడి వైపున పెడితే మంచిది. ఇలా గుడ్లగూబ చిత్రాన్ని ఉంచితే లక్ష్మి దేవి ఆశీర్వాదాన్ని తెస్తుంది. ఇది పనిలో వచ్చే అన్ని అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు.
ఇది కూడా చదవండి: చలికాలంలో ఇది తినండి..రుచికి రుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.