Ravi Prakash Silicon Andhra Hospital : రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని హాస్పిటల్ లో ధన్వంతరి వార్డు ప్రారంభోత్సవం!

కూచిపూడిలోని రవిప్రకాష్‌ సిలికానాంధ్ర ఆసుపత్రిలో ధన్వంతరి వార్డును ప్రారంభించింది.. దీని వల్ల మరింత మంది రోగులకు ఎక్కువ సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని హాస్పిటల్ యజమాన్యం తెలిపింది.

New Update
Ravi Prakash Silicon Andhra Hospital : రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని హాస్పిటల్ లో ధన్వంతరి వార్డు ప్రారంభోత్సవం!

Inauguration Of Dhanvantari Ward : కూచిపూడి (Kuchipudi) లోని రవిప్రకాష్‌ సిలికానాంధ్ర ఆసుపత్రిలో ధన్వంతరి వార్డును ప్రారంభించింది. దీని వల్ల మరింత మంది రోగులకు ఎక్కువ సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని హాస్పిటల్ యజమాన్యం తెలిపింది. కూచిపూడి గ్రామంలో పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే సంకల్పంతో 2018 అక్టోబర్ 18న విజయదశమి రోజు రవి ప్రకాష్ (Ravi Prakash) సిలికాన్ ఆంధ్ర సంజీవిని హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది..నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) చేతుల మీదగా ప్రారంభోత్సవం జరిగింది.

publive-image

దివిసీమ ప్రాంతంలో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు రవి ప్రకాష్, సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిపట్ల ఆనంద్ నడుం బిగించారు. 1977 దివిసీమ ఉప్పెనతో కోలుకొని దివిసీమ ప్రాంతానికి అత్యాధునిక వైద్యం తీరని కలగా మిగిలింది. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన కూచిపూడి కళ కలిగినటువంటి కూచిపూడి గ్రామాన పేదవాడికి ఉచిత వైద్యం అందించే కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ నిర్మాణం చేయాలని ఆలోచన ఎవరికొస్తుంది చెప్పండి.. కూచిపూడి నాట్యం ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది.. అలాంటి . దివిసీమ ప్రాంతంలో పూర్తిస్థాయిలో అతిపెద్ద ప్రభుత్వ హాస్పటల్ కూడా లేదు. కూచిపూడి పరిసర ప్రాంతాల నుండి మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ కు 30km లు, గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్ కు 25km, విజయవాడ లో ప్రభుత్వ హాస్పిటల్ 50km దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

రవి ప్రకాష్ సిలికాంధ్ర హాస్పటల్ ప్రత్యేకతలు

కూచిపూడి లోని ప్రధాన సెంటర్లో ఉన్న బస్టాండును ఆనుకుని ఉన్న స్థలంలో లక్ష 50 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 మండలాల్లో 151గ్రామాలకు పూర్తిగా ఉచిత వైద్యం అందించేలా ఈ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. 5 అంతస్తులతో నిర్మాణం జరిపిన ఈ హాస్పిటల్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 200 పడకలతో పూర్తిగా పేదలకి కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రవి ప్రకాష్ సిలికాన్ ఆంధ్ర.

ఈ హాస్పిటల్ లో రోజుకి 300 నుండి 350మంది వరకు అవుట్ పేషెంట్స్, 55మంది ఇన్ పెషెంట్స్ గా వైద్య సేవలు పొందుతున్నారు.ఈ హాస్పిటల్లో ప్రతిరోజు 2 నుండి 3సర్జరీలు జరుగుతున్నాయి. ఇక ఈ హాస్పిటల్ లో అందుబాటులో ఉన్న వైద్య సేవలు

జనరల్ మెడిసిన్, ఆర్థో ( ఎముకలు, కీళ్లు), ENT, గైనకాలజిస్ట్ ( స్త్రీలు, మరియు ప్రసూతి) పిడియాట్రిక్ ( చిన్న పిల్లలు), పాలీట్రామా, జనరల్ సర్జన్, దంత వైద్యం, యూరాలజీ, డయాబెటాలజీ (షుగర్), గుండె వైద్యం, ఛాతి మరియు ఊపిరితిత్తులు, నరాల వైద్యానికి సంబంధించిన డాక్టర్లు అందుబాటులో ఉన్నారు.

ఈ హాస్పిటల్ లో ఉచితంగా కన్సల్టేషన్, మందులు, బ్లడ్ టెస్ట్ లు, xray అల్ట్రా సౌండ్ స్కానింగ్, TMT టెస్ట్, సర్జికల్ సేవలు, ఐసీయూ, డయాలసిస్ సేవలు, వార్డు సేవలు, పేషెంట్ కి అటెండర్ కి ఉచిత భోజనం

రవి ప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని హాస్పటల్లో అందుబాటులో ఉన్న సిబ్బంది

అందుబాటులో ఉన్న డాక్టర్స్ - 14 మంది

నర్స్ మరియు శుభ్రత సిబ్బంది - 90మంది

ఆంబిలేన్స్ సర్వీస్ -2(AMC అంబులెన్సు 24 గంటల సదుపాయం)

బ్లడ్ టెస్ట్ ల్యాబ్స్ - 2

*ఆపరేషన్ థియేటర్లో అందుబాటులో ఉన్నవి -2
అందుబాటులోకి రాబోతున్నవి -5*

ఇక ఈ హాస్పిటల్ ప్రస్తుతం దినదినాభివృద్ధి చెందుతూ.. అనేకమంది పేద వాళ్లకు ఉచిత వైద్యం అందిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన దగ్గర నుండి, డెలివరీ అయ్యి, పుట్టిన బిడ్డను ఇంటికి తీసుకు వెళ్లే వరకు అన్ని ఉచితంగా అందిస్తున్నారు.పేషెంట్ తో పాటు వాళ్లతో పాటు ఉండే అటెండర్ కూడా రెండుపూటల ఆహారం అందిస్తున్నారు.

*ఈ హాస్పిటల్లో అత్యాధునిక కార్పొరేట్ స్థాయి బెడ్స్ ను ఉపయోగిస్తున్నారు. ఆసియా (Asia) లోని అతిపెద్దదైన ఎక్స్రే ల్యాబ్ రవి ప్రకాష్ సిలికాన్ ఆంధ్ర సంజీవని హాస్పటల్ (Silicon Andhra Sanjivani Hospital) లో మాత్రమే ఉంది. భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి మూడు అతిపెద్ద ఆపరేషన్ థియేటర్స్ ను కుడా సిద్ధం చేస్తున్నారు.

ఈ హాస్పటల్ అందిస్తున్న సేవలు పట్ల అక్కడ ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లగా ఇలాంటి వైద్యం దొరక ఇబ్బందులు పడ్డామని, కార్పొరేట్ స్థాయి వైద్యం తమ గ్రామాల్లోనే అందుబాటులోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని అక్కడికి వస్తున్న రోగులు చెప్తున్నారు. ఈ హాస్పిటల్ నిర్మాణంలో అత్యంత కీలక భూమి పోషించారు tv9/ Rtv రవి ప్రకాష్.

ఆయన ఈ హాస్పిటల్ నిర్మాణం కోసం 4కోట్ల రూపాయల విరాళం ఇవ్వడమే కాకుండా ఆయన స్నేహితులు, సన్నిహితులు ద్వారా మరో 8కోట్ల రూపాయలు విరాళం అందించారు తెలుగు టీవీ చరిత్రలో టెలిథాన్ నిర్వహించి, ఈ హాస్పటల్ కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రవి ప్రకాష్ చొరవతో ఈరోజు దివిసీమలో కొన్ని వేల మందికి కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందుతుంది.. సామాజిక బాధ్యతతో రవి ప్రకాష్ వేసిన అడుగులు దివిసీమ ప్రాంతానికి ఉచిత కార్పొరేట్ వైద్యం అందేలా చేసింది..

రోగం వస్తే బెజవాడ వైపో,మచిలీపట్నం వైపో చూసుకుంటూ, ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని వెళ్లే రోజుల నుండి, నిమిషాల వ్యవధిలోనే కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు అందేలా రవి ప్రకాష్ చేశారు.

దాతల సహకారం భవిష్యత్తులో రవి ప్రకాష్ సిలికాన్ ఆంధ్ర సంజీవిని హాస్పిటల్ మరింత విస్తరించి మరికొన్ని వేలమంది పేద ప్రజల ఆపన్న హస్తంగా మారే అవకాశం ఉంది.

Also Read : లెఫ్టినెంట్ కల్నల్‌ హోదాలో.. వయనాడ్‌లో మోహన్ లాల్ పర్యవేక్షణ

Advertisment
తాజా కథనాలు