పూజల పేరిట లక్షల్లో దండుకోని ఉడాయించిన ముఠా..!

కడప జిల్లాలో మానసిక సమస్యలను ఆసరాగా చేసుకుని లక్షల్లో దండుకోని ఉడాయించింది ఓ ముఠా. తాను చెప్పినట్టే చేస్తే బిడ్డ మాములు మనిషిగా మారుతాడంటూ ఓ తల్లికి నమ్మబలికారు. పూజలు చేయాలంటూ మాయమాటలు చెప్పారు. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలతో ఎస్కేప్ అయ్యారు.

పూజల పేరిట లక్షల్లో దండుకోని ఉడాయించిన ముఠా..!
New Update

కడప జిల్లాలో పూజల పేరిట లక్షల్లో సోమ్ము చేసుకోని ఉడాయించింది ఓ ఘరానా మోసగత్తె. అసలేం జరిగిందంటే ?. ఆల్మాస్ పేటకు చెందిన గులాబీ జాన్ అనే మహిళకు నలుగురు పిల్లలు. అయితే, వారిలో ఒక కొడుకు మానసిక పరిస్దితి బాగాలేకపోవడంతో పలు వైద్యశాలలో చూపించింది ఆ తల్లి. ఇక నయం కాదని తెలుసుకున్న ఆ తల్లి తల్లడిల్లిపోయింది. అయినా కూడా బిడ్డ ఆరోగ్యం కోసం రకరకాల ప్రయత్నాలు చేసింది. బిడ్డను మాములు మనిషి చేయడం కోసం చెప్పిన వారి మాటలను నమ్మి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది.

Also Read: మాజీ మంత్రి శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి ..నిప్పులు చెరిగిన వైసీపీ ఎమ్మెల్యే

ఈ క్రమంలో బిడ్డ ఆరోగ్య పరిస్ధితిని ఆసరా చేసుకోని క్యాష్ చేసుకోవాలని భావించింది ఓ మహిళ. ఇందు కోసం కుటుంబంతో కలిసి స్కెచ్ వేసింది.  బిడ్డను మాములు మనిషిగా మార్చడం నాది బాధ్యత అంటూ నమ్మబలికింది. దీంతో, మహిళ మాయ మాటలు నమ్మిన గులాబీ జాన్ ఆమె ఎలా చెబితే ఆలా చేసింది. పూజలు చేయాలంటూ ఓంటిపై ఉన్న నగలు అన్నీ ఓ కవర్ లో ఉంచి ప్లాస్టర్ చుట్టింది. ఆ కవర్ ను తానే  బీరువాలో పెట్టాలని చెప్పింది ఆ మాయలేడి. అయితే, బీరువాలో పెట్టె క్రమంలో కవర్లు మార్చి పెట్టింది.

తాను పెట్టిన కుండ, కవర్ లను తీయవద్దని గులాబీ జాన్ కు చెప్పింది. మాట మీరి కవర్ తెరిస్తే బిడ్డ రక్తం కక్కుకోని చస్తాడని భయ పెట్టింది. అలా భయ పెట్టి మూడు లక్షల డబ్బు, బంగారు నగలతో ఉడాయించింది. అయితే, రెండు రోజుల తర్వాత బీరువాలో ఉంచిన వాటిని చూసి నిర్ఘాంత పోయింది గులాబీ జాన్. నోట్ల కట్టల స్థానంలో తెల్ల కాగితాలు, బంగారు ఆభరణాల స్థానంలో రకరకాల వస్తువులను చూసింది. మోసపోయానని గుర్తించిన గులాబీ జాన్ ఇరుగు పోరుగు వారితో చర్చించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ మాయలేడి ఇలా పలువురిని మోసం చేసినట్లు ఒక్కోక్క ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ చేతిలో మోసపోయిన తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది బాధిత మహిళ గులాబీ జాన్. మానసిక సమస్యలను ఆసరాగా చేసుకోని లక్షల్లో దండుకుంటున్న ముఠా గుట్టు రట్టు చేయాలని పోలీసులకు విన్నవించింది.

#kadapa-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe