Hi -Tech robbery: దర్జాగా విమానంలో వెళ్లి.. ఘరానాగా దోపీడీ చేసి.. ఈ దొంగల రూటే వేరు!

విమానంలో 1500 కిలోమీటర్లు వెళ్లి దొంగతనం చేసి తిరిగి ఇంటికి చేరుకునే ముఠాను ముంబయి పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా మీరట్ నుంచి ముంబయికి వారానికోసారి విమానంలో వెళ్లి అక్కడ మహిళలు టార్గెట్ గా బంగారం దొంగతనం చేసి విమానంలో ఢీల్లీకి.. అక్కడ నుంచి కారులో మీరట్ కి వెళ్ళిపోతారు

New Update
Hi -Tech robbery: దర్జాగా విమానంలో వెళ్లి.. ఘరానాగా దోపీడీ చేసి.. ఈ దొంగల రూటే వేరు!

Hi -Tech robbery: ఉద్యోగం కోసం ట్రైన్ లో అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు. హైదరాబద్ లో ఉద్యోగం.. కాజీపేట నుంచి రోజూ వచ్చి వెళ్లడం లేదా హైదరాబాద్ నుంచి శివారు ప్రాంతాల్లో ఉద్యోగాలకు వెళ్లిరావడం మనందరికీ తెలిసిందే. ఇక బిజీగా ఉండే బిజినెస్ బాబులు.. కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో కీలక బాధ్యతల్లో ఉన్న వారు.. ఉద్యోగ పనుల నిమిత్తం వారంలో ఒకటి రెండు సార్లు  విమానంలో హైదరాబాద్ నుంచి ముంబయి.. ఢిల్లీ వంటి ప్రాంతాలకు నిత్యం పరుగులు తీయడమూ అక్కడక్కడా కనిపిస్తుంది. కానీ ఈ దొంగ బాబులు మాత్రం వారానికోరోజు తెల్లవారకుండా విమానం ఎక్కి 1500 కిలోమీటర్లు వెళ్లి.. అక్కడ తమ పని కానిచ్చి.. సాయంత్రం డిన్నర్ టైమ్ కి మళ్ళీ విమానంలో ఇంటికి చేరిపోతున్నారు. ఈ అతి తెలివైన దొంగల గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఆ విశేషాలు మీకోసమే.. 

Hi -Tech robbery: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నుంచి ముంబయికి వారానికి ఒకసారి 1500 కిలోమీటర్లు ప్రయాణించే దొంగల ముఠా గుట్టు రట్టయింది. వీరు ముంబయిలో  మహిళలను దోచుకునేవారు. తర్వాత దోచుకున్న వస్తువులతో విమానంలో ఢిల్లీకి వచ్చేవారు. ఆ తరువాత అక్కడి నుంచి మీరట్‌కి తిరిగి కారులో చేరుకునేవారు. అయితే ఎంత తెలివైన దొంగ అనుకున్నా ఏదో ఒకరోజు కచ్చితంగా పట్టుబడతాడు. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది.

Hi -Tech robbery: ఈ ముఠా మీరట్‌కు 1500 కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్ర రాజధాని ముంబైలో దొంగతనాలకు పాల్పడేది. ఈ ముఠా విశేషమేమిటంటే.. తెల్లవారుజామున ఫ్లైట్‌లో అక్కడికి వెళ్లి అక్కడ దోపిడి చేసేవారు. సాయంత్రం తిరిగి విమానంలో వచ్చేవారు. ఇటీవల, ముంబైలోని మాతుంగా పోలీస్ స్టేషన్ పరిధిలో డబుల్ డెక్కర్ బస్సులో మహిళతో మాటలు కలిపి దోపిడీకి పాల్పడిన సంఘటన జరిగింది. దుండగులు మహిళను కాఫీ తాగించి అపస్మారక స్థితికి చేర్చి బంగారు గొలుసు, ఇతర వస్తువులను దోచుకెళ్లి పారిపోయారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.

పోలీసుల విచారణలో షాకింగ్..
Hi -Tech robbery: మాతుంగ పోలీసులు విచారణ ప్రారంభించగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దుండగులు ఒకే ముఠాకు చెందిన వారని తేలింది. వీరు వారానికి ఒక్కసారే దోపిడీకి పాల్పడుతున్నారు. దీని కోసం వీరు మీరట్ నుండి ముంబైకి వచ్చి అదే రోజు సాయంత్రం తిరిగి మీరట్ చేరిపోతారు. వారిని ఒకరోజు ముంబయి వెళ్లి అక్కడ దర్జాగా దొంగతనం ముగించి.. ఆనక ఢిల్లీకి విమానంలో వెళ్ళిపోతారు.  తర్వాత ఇక్కడి నుంచి కారులో మీరట్‌కి తిరిగి వస్తారు. ముంబయిలో జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆ సమయంలో నిందితుడి ఆచూకీని కనిపెట్టి మీరట్‌లోని కొత్వాలి ప్రాంతంలో దాడి చేశారు. అక్కడ ముంబై పోలీసులు మీరట్‌లోని షహనత్తన్‌కు చెందిన యూనస్ అనే నేరస్థుడిని పట్టుకున్నారు. ఆ తరువాత అతను ఇచ్చిన ఈ విమాన ప్రయాణ సమాచారం విని అవాక్కయ్యారు పోలీసులు. తరువాత మరో నిందితుడి కోసం బ్రహ్మపురిపై దాడి చేశి అక్కడ పట్టుకున్నారు. 

ఈ దుర్మార్గులిద్దరూ చాలా కాలంగా నేరాలకు పాల్పడుతున్నారని మాతుంగ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ఎస్‌ఐ సంతోష్ మాలిక్ మీడియాకు తెలిపారు. వీరి గ్యాంగ్‌లో చాలా మంది వ్యక్తులు ఉన్నారనీ.. వారి గురించి కూడా వెతుకులాట మొదలు పెట్టమని ఆయన వివరించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు