క్రికెట్ చరిత్రలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ప్రత్యేక పేజీ ఉంటుంది. భారత క్రికెట్‌ను అత్యున్నత స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాడు. కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా టీమిండియాకు ఎనలేని సేవలు అందించాడు. భారత్‌కు వన్డే, టీ-20 వరల్డ్‌కప్‌లను అందించి క్రికెట్ అభిమానుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అందుకే దిగ్గజ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఏళ్లు గడుస్తున్నా, అతడి పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. టీవీ యాడ్స్, ఎండార్స్‌మెంట్స్ ఆదాయంలో అతడు ప్రస్తుత క్రికెటర్ల కంటే ముందున్నాడు. అలాగే పెట్టుబడులు పెట్టి భారీగా సంపద ఆర్జించాడు. ప్రపంచ క్రికెట్‌లో సంపన్న ఆటగాళ్ల జాబితాలో ధోని ముందు వరుసలో ఉన్నాడు.
జార్ఖండ్ డైనమేట్‌గా భారత క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఎంఎస్ ధోని అనతికాలంలోనే కీలక ఆటగాడిగా ఎదిగాడు. బ్యాటింగ్, కీపింగ్‌లో అద్భుతంగా రాణిస్తూ భారత జట్టుకు పగ్గాలు అందుకున్నాడు. ధోని సారథ్యంలో భారత జట్టు టీ20 వరల్డ్‌కప్, వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. దీంతో ధోని పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. అతడు కొన్నేళ్లుగా వివిధ కంపెనీలకు, ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ధోని నికర ఆస్తుల విలువ రూ.1040 కోట్లు పైమాటే.క్రికెట్ అభిమానులు ధోనిని ముద్దుగా తలా, మహి అని పిలుస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పినా ఇంకా ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. ప్రతి సీజన్‌కు రూ.12 కోట్లు వసూలు చేస్తున్నాడు. సోషల్ మీడియా ఎండార్స్‌మెంట్స్ కోసం రూ.2 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. ఇక బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో కూడా భారీగా వెనకేసుకుంటున్నాడు. ఒక్కో బ్రాండ్‌కు రూ.4 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు. ప్రఖ్యాత దుస్తుల బ్రాండ్ సెవెన్ ను నడుపుతున్నాడు. ఇది స్పోర్ట్స్ కంపెనీ. రియల్ ఎస్టేట్‌లో కూడా మహేంద్రుడు భారీగా పెట్టుబడులు పెట్టాడు.
ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ అనే సిమెంట్ కంపెనీకి ధోని వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. చెన్నైకి చెందిన ఫుట్‌బాల్ క్లబ్ ‘చెన్నైయిన్ FV’, రాంచీకి చెందిన హాకీ క్లబ్ ‘రాంచీ రేస్’కి అతడు సహ యజమాని. కార్24 అనే వెహికల్ రీసెల్లర్ కంపెనీకి పెట్టుబడిదారుడుగా, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ధోనీ సొంత ఊరు రాంచీ. ఇది జార్ఖండ్ రాజధాని. రాంచీలో ‘మహి రెసిడెన్సీ’ అనే మధ్యతరగతి హోటల్‌ను రన్ చేస్తున్నాడు. Airbnb, ఒయో, మేక్ మై ట్రిప్ వంటి వాటికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. బెంగళూరులో ‘MS ధోని గ్లోబల్ స్కూల్’ను సక్సెస్ పుల్‌గా నడుపుతున్నాడు. బెవరేజెస్, చాక్లెట్ కంపెనీ 7ఇంక్ బ్రెవ్స్(7Ink Brews)లో భారీగా పెట్టుబడి పెట్టాడు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే ధోని ఈ రంగంలోకి అడుగు పెట్టాడు. ‘ధోనీ స్పోర్ట్స్ ఫిట్’ అనే జిమ్ చైన్‌ను నడుపుతున్నాడు. ఇవి దేశవ్యాప్తంగా 200కి పైగా నగరాల్లో వెలిశాయి.
ధోనికి బైక్స్, కార్లు అంటే ఎంతో ఇష్టం. అందుకే అతని గ్యారేజీ షోరూమ్‌ను తలపిస్తుంది. నార్టన్ జూబ్లీ 250, కవాసకి నింజా H2, కాన్ఫెడరేట్ X132 హెల్‌క్యాట్ వంటి స్పోర్ట్స్ బైక్స్‌తో పాటు నిస్సాన్ SUV జోంగ్, ల్యాండ్ రోవర్ 3 స్టేషన్ వాగన్ సిరీస్, రోల్స్ రాయిస్ సివర్ వ్రైత్ II, జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్ వంటి లగ్జరీ కార్లు ధోని గ్యారేజీలో ఉంటాయి.