/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/train.jpg)
Train: కోల్ కతా నుంచి ముంబైకి వెళ్లే జ్ఞానేశ్వరీ ఎక్స్ ప్రెస్ లో గత శనివారం ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఏసీ బోగీలో ఎలుకలు సూట్ కేసులు కొరికేశాయి. దీంతో ఓ బాధితుడు రైల్వే శాఖ తీరుపై మండిపడ్డాడు. ఎలుకలు తన సూట్ కేసులు ఎలా కొరికాయో చూడండంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోను పోస్ట్ చేశాడు.
Also Read: వరంగల్ – ఎంజీఎం ఆసుపత్రిలో కరెంట్ కట్.. అవస్థలు పడ్డ రోగుల ..!
దీనిపై ఫిర్యాదు చేసేందుకు అర గంట నుంచి టీసీ కోసం ఎదురుచూస్తున్నా అంటూ పేర్కొన్నాడు. ఈ ఘటనపై రైల్వే శాఖ స్పందించింది. ఈ విషయం చాలా ఆందోళన కలిగిస్తోందని.. మీకు వీలైనంత వెంటనే సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
@RailMinIndia @RailwaySeva @Central_Railway @PMOIndia
Train 12102 Departed on 19th May Coach H1 Seat A-2.
PNR
6535087042.Suitcases damaged by rodents.
Trying to the TC for half hour to lodge complaint. pic.twitter.com/EfeX39EYI4— ✨CG✨ (@CG_bharatiya) May 21, 2024