కనిగిరి వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు.!

కనిగిరి వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న కుందూరు నాగార్జున రెడ్డి కే మళ్లీ అవకాశం ఇస్తున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీంతో బుర్ర మధుసూదన్ యాదవ్ వర్గీయులు నిరాశ చెందుతూ వైసీపీ కార్యక్రమం నుండి వెనుదిరిగారు.

New Update
కనిగిరి వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు.!

YCP: ప్రకాశం జిల్లా కనిగిరిలో శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో సామాజిక సాధికారత బస్సు యాత్ర చేశారు. ఈ సందర్భంగా కనిగిరి పట్టణంలో వైసీపీ శ్రేణులు ర్యాలీ చేసి, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలందరూ అన్యాయమైపోయారన్నారు. కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, రాజ్యాధికారంలో భాగస్వాములయ్యారని కీర్తించారు. బడుగు బలహీన వర్గాల అందరూ ఏకమై మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్యనించారు.

Also Read: రేపు, ఎల్లుండి సీఎం జగన్ షెడ్యూల్ ఇదే..!

కాగా కనిగిరి లో జరిగిన సామాజిక సాధికారత యాత్రకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, కనిగిరి, వెలిగండ్ల, హనుమంతునిపాడు జడ్పిటిసి లతో సహా ముఖ్యనేతలు డుమ్మా కొట్టారు. ముఖ్య నేతలు అందరూ కార్యక్రమానికి రాకపోవడంతో కనిగిరి వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు బయటపడ్డాయి.

మార్కాపురం నియోజకవర్గంలో జరిగిన బస్సు యాత్రలో రానున్న ఎన్నికలలో అక్కడ సిటింగ్ ఎమ్మెల్యే గా ఉన్న కుందూరు నాగార్జున రెడ్డి కే మళ్లీ అవకాశం ఇస్తున్నట్లు ఐదు జిల్లాల కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీంతో, రానున్న ఎన్నికలలో బుర్ర మధుసూదన్ యాదవ్ పేరు ప్రకటిస్తారని ఆశించిన బుర్ర వర్గీయులకు రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే టికెట్ పై స్పష్టత ఇవ్వకపోవడంతో నిరాశ ఎదురయింది.

Advertisment
తాజా కథనాలు