/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ycp-dadi-jpg.webp)
Kadapa: కడప జిల్లా రాయచోటి సమీపంలో వైసీపీ నేత దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. బండపల్లి టోల్‍గేట్ సిబ్బందిపై వైసీపీ ఎంపీటీసీ భర్త శివశంకర్ నాయుడు దాడి చేశారు. లక్కిరెడ్డిపల్లె మండలం పాలెం ఎంపీటీసీ భర్త శివశంకర్ నాయుడు, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. గేట్ తీయాలంటూ సిబ్బందిని దూషిస్తూ వీరంగం సృష్టించారు. గేటు తీసేలోపే సిబ్బంది వద్దకు వచ్చి జుట్టు పట్టుకుని చితకబాదారు.
Also Read: షేర్ మార్కెట్ లో అప్పులు… మహిళను హత్య చేసిన నిందితుడు అరెస్ట్..!
పక్కనే ఉన్న మరో టోల్‍గేట్ సిబ్బందిపై కూడా వైసీపీ నేత అతని అనుచరులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో టోల్‍గేట్ సిబ్బంది గాయపడ్డాడు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టోల్‍గేట్ సిబ్బంది. వైసీపీ నేత శివశంకర్ నాయుడు, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: ఒకరితో ప్రేమ మరోకరితో శృంగారం.. చివరికి ఏమైందంటే!
శివశంకర్ నాయుడు దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో పోలీసులకు అందజేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు మరల జరగకుండా ఉండేలా చూడాలన్నారు. ఎంపీటీసీ భర్త అయి ఉండి ఇలా దౌర్జన్యం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తూ మండిపడుతున్నారు.