భారత్ లో చదువు కన్నా వివాహాలకే ఎక్కువ ఖర్చు!

భారత్‌లో చదువు కంటే పెళ్లికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రముఖ మ్యారేజ్ బ్యూరో జెఫ‌రీస్ సంస్థ తెలిపింది. భారతీయులు ఆహారం, నిత్యావసరాల తర్వాత పెళ్లికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారని..ఏటా రూ.10 లక్షల కోట్లకు పైనే పెళ్లికి ఖర్చవుతోందని అంచనా వేసింది. 

New Update
భారత్ లో చదువు కన్నా వివాహాలకే ఎక్కువ ఖర్చు!

ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు పెళ్లిళ్లు జరుగుతున్నాయని.. చైనాలో 70 నుంచి 80 లక్షలు, అమెరికాలో 20 నుంచి 25 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నాయని పేర్కొంది. అమెరికాతో పోలిస్తే భారత వివాహ పరిశ్రమ పరిమాణం రెండింతలు ఉంటుందని తెలిపింది. ఒకవేళ వివాహాలను ప్రత్యేక రిటైల్‌ కేటగిరీగా వర్గీకరిస్తే.. ఆహారం, నిత్యావసరాల తర్వాత రెండో అతిపెద్ద విభాగంగా ఇదే ఉంటుందని వివరించింది. అంతర్జాతీయ స్థాయి ఖరీదైన ప్రదేశాలు, అతిథులకు మర్యాదలు, పసందైన వంటకాలతో భారత వివాహాలు ఆడంబరంగా జరుగుతాయని జెఫ‌రీస్‌ నివేదిక తెలిపింది.

ఈ క్రమంలో దుస్తులు, ఆభరణాలు, ఆతిథ్యం, క్యాటరింగ్, రవాణా వంటి రంగాల కార్యకలాపాలు పుంజుకుంటాయని పేర్కొంది. దేశంలో ఏటా తయారైయే ఆభరణాల,దుస్తులు విక్రయాల్లో సగం పెళ్లిళ్ల కోసమే అని తెలిపింది. పెళ్లికి 6–12 నెలల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతాయని, గరిష్ఠంగా 50 వేల మంది వరకు అతిథులు హాజరవుతుంటారని తెలిపింది.

భారత్‌లో సగటున ఒక పెళ్లిపై కనీసం రూ.12.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. స్థోమతను బట్టి ఇది అంతకంతకూ పెరుగుతుందని పేర్కొంది. అదే అమెరికాలో విద్యపై చేసే వ్యయంతో పోలిస్తే వివాహంపై చేసే ఖర్చు సగమేనని వెల్లడించింది.

Advertisment
తాజా కథనాలు