Hyderabad: హైదరాబాద్ శివారులో దారుణం.. 5 ఏళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం.. హైదరాబాద్ నగర శివార్లలోని భానూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల బాలికపై బీహార్‌కు చెందిన 60 ఏళ్ల వలస కార్మికుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. నిందితుడిని బీడీఎల్ భానూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. By Shiva.K 19 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad:హైదరాబాద్ నగర శివార్లలోని భానూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల బాలికపై బీహార్(Bihar)కు చెందిన 60 ఏళ్ల వలస కార్మికుడు అత్యాచారం చేసి హత్య చేశాడు. నిందితుడిని బీడీఎల్ భానూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధి గ్రామంలో ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్నన నిందితుడు.. అదే ప్రాంతంలో నివసిస్తున్న 5 ఏళ్ల చిన్నారికి కూల్ డ్రింక్ ఇస్తానని ఆశచూపాడు. తన వెంట తీసుకెళ్లాడు. సమీపంలో ఉన్న పత్తి పొలాల్లోకి చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ పశువు చర్యకు చిన్నారి తట్టుకోలేక విలవిల్లాడింది. గుక్కపట్టి ఏడ్చింది. దాంతో బెదిరిపోయిన ఆ కీచకుడు.. చిన్నారిని గొంతుకోసి చంపేశాడు. ఇదికూడా చదవండి: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్.. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ నుంచి వలస వచ్చిన కార్మికుడు.. నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన వసతి గృహంలో ఉంటున్నాడు. అదే వసతి గృహాల్లో బాధిత బాలిక కుటుంబ సభ్యులు కూడా ఉంటున్నారు. అక్కడే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, చిన్నారి తల్లిదండ్రులు వారి స్వగ్రామానికి వెళ్లారు. ఆ క్రమంలో చిన్నారిని ఇంట్లో ఉన్న తాత వద్ద వదిలేసి వెళ్లారు. అయితే, పని మీద.. చిన్నారి తాతయ్య బయటకు వెళ్లాడు. ఆమెను ఇంట్లోనే ఉండని జాగ్రత్తలు చెప్పి వెళ్లాడు. భోజనానికి ఇంటికి తిరిగి వచ్చేసరికి గదిలో చిన్నారి కనిపించలేదు. పాప కోసం ఆ ప్రదేశం అంతా వెతికాడు. ఎంతకీ కనిపించలేదు. ఇతర కార్మికుల సాయంతో చుట్టు పక్కన ప్రాంతాలన్నీ గాలించారు. ఇంతలో నిర్మాణ స్థలంలో ఉన్న వాచ్‌మెన్.. వలస కార్మికుడితో బాలిక నడుచుకుంటూ వెళ్లడం తాను చూశానని చెప్పాడు. దాంతో వీరు.. ఆ వృద్ధుడిని పట్టుకుని గట్టిగా నిలదీశారు. దాంతో జరిగిన విషయమంతా చెప్పాడు. అతనికి దేహ శుద్ధి చేసి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతనిపై ఐపీసీ సెక్షన్ 376, 302, ఫోక్సో చట్టం కింద, జువైనల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. ముక్కుపచ్చలారని చిన్నారి, కళ్ల ముందు కలియతిరుగుతూ సందడి చేసిప పాప.. ఇప్పుడు నిర్జీవంగా ఉండటాన్ని చూసి గుండెపగిలేలా ఏడ్చారు కుటుంబ సభ్యులు. వారి కన్నీరు చూసి ఇతరులు సైతం బోరున విలపించారు. చిన్నారి ప్రాణాలను హరించిన ఆ కీచకుడిని నడిరోడ్డులో ఉరి తీసి చంపేయాలని డిమాండ్ చేస్తున్నారు జనాలు. ఇదికూడా చదవండి: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు.. #hyderabad #hyderabad-news #5-year-old-girl #migrant-worker #bihar-migrant-worker #60-year-old మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి