సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. మహిళ మృతి.!

హన్మకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటుచేసుకుంది. ఎక్సైజ్ సీఐ శరత్ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మహిళను ఢి కొట్టాడు. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అయితే, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని మృతురాలి బంధువుల ఆందోళన చేపట్టారు.

New Update
సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. మహిళ మృతి.!

Warangal: వరంగల్ జిల్లా కాజీపేటలో దారుణం చోటుచేసుకుంది. నిన్న ఎక్సైజ్ సీఐ శరత్ కుమారుడు వంశీ ర్యాష్ డ్రైవింగ్ చేసి మహిళ ప్రాణాలు బలి తీసుకున్నాడు. అయితే, ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని మృతురాలి బంధువుల ఆందోళన చేపట్టారు. అసలేం జరిగిందంటే.?

Also read: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ సర్కార్‌ కు కేఆర్ఎంబీ లేఖ.!

వరంగల్ జిల్లా కాజీపేటలో నిన్న ఓటు వేసిన అనంతరం మహిళ భర్త బైక్ ఎక్కేందుకు తన బ్యాగ్ ను సర్ధుకుంటూ సిద్ధమవుతోంది. అయితే, ఆమె వెనుక వైపు నుండి ఓ కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మహిళను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.  చనిపోయిన మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉండడంతో వారు తల్లి కోసం ఆందోళన చెందుతున్నారు.

Also Read: 40% ఓట్లు వచ్చిన వారికి పవర్.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏది?

అయితే ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు కాజీపేట పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ఓ పోలీస్ అధికారి కుమారుడే ఈ యాక్సిడెంట్ చేశాడని అందుకే పోలీసులు పట్టించుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.  అధికారులు ఇప్పటికైనా స్పందించి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు