TG Police: ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు సేఫ్.. తెలంగాణ పోలీసుల కీలక ప్రకటన! తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్‌లో ఉంటారు. నాలాలో చెరువులు, కుంటలు, తూములు, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దని.. ప్రయాణాలను రద్దు చేసుకోడం, వాయిదా వేసుకుంటే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 02 Sep 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TG Police: మీరు తీసుకునే జాగ్రత్తలతోనే మీరు సురక్షితంగా ఉంటారు. వర్షాకాలంలో వచ్చే వరద నీరు, వ్యాధుల గురించి కొన్ని జాగ్రత్తలు పాటించటం వల్లన ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండోవచ్చని అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. వీటిని ఫాలో అయితే వ్యాధుల నుంచి బయటపడటంతోపాటు వాన ముప్పు నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారని వారి చెబుతున్నారు. వర్షకాలంలో సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు చూద్దాం. వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటించండి సురక్షితంగా ఉండండి!#Hyderabad #Hyderabadrains #TelanganaRains #RachakondaPolice pic.twitter.com/PzJSYbxDlI — Rachakonda Police (@RachakondaCop) September 2, 2024 వర్షకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వాతావరణ సమాచారం తెలుసుకుంటూ ఉండాలి. ప్రయాణాలను రద్దు చేసుకోడం, వాయిదా వేసుకుంటే మంచిది. నాలాలో చెరువులు, కుంటలు, తూములు, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దు వాహనాలను సురక్షిత ప్రాంతాలలో పార్క్ చేసుకోవాలి. మెడికల్ కిట్ సిద్ధంగా ఉంచుకోవాలి. ఆహారం కొరకు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. తడి చేతులతో స్విచ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ముట్టుకోవద్దు. పిల్లలను ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండాలి. పిల్లలను బయటకు పంపవద్దు. ఇంటిపై నీరు నిలవకుండా, తూములు శుభ్రంగా ఉంచుకోవాలి. కాలనీలోకి వరద నీరు వస్తున్నట్లయితే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అత్యవసర పరిస్థితిల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. రెయిన్ కోట్, గొడుగు, వాటర్ ప్రూఫ్ షూ లాంటివి ధరించాలి. మ్యాన్ హోల్ ఉంటాయి జాగ్రత్త చూసి నడవాలి. వరద ప్రవాహం ఉన్నచోట ముందుకు వెళ్ళవద్దు. ఎలక్ట్రిక్ స్తంభాలు ముట్టుకోవద్దు. ఎలక్ట్రిక్ తీగలు తెగిపడి కానీ.. వేలాడుతూ గానీ ఉంటే అటువైపు వెళ్ళవద్దు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 100 ఫోన్ చేయాలి. #tg-police మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి