ఈ కషాయం తాగండి..ఇమ్యూనిటీ పెంచుకోండి..

ప్రస్తుతం ఒక టాబ్లెట్ వేసుకుంటే చిటికెలో మన సమస్య తొలగిపోవాలని కోరుకునేవాళ్ళు ఎక్కువయ్యారు. కానీ అటువంటి టాబ్లెట్లను ఉపయోగించడం వల్ల కేవలం తాత్కాలిక ప్రయోజనం మాత్రమే లభిస్తుంది. కాని మేము ఇక్కడ చెప్పబోయే కషాయాన్ని తీసుకుంటే మీకు ఎటువంటి రోగాలు దరిచేరవు.

ఈ కషాయం తాగండి..ఇమ్యూనిటీ పెంచుకోండి..
New Update

ప్రస్తుతం ఒక టాబ్లెట్ వేసుకుంటే చిటికెలో మన సమస్య తొలగిపోవాలని కోరుకునేవాళ్ళు ఎక్కువయ్యారు. కానీ అటువంటి టాబ్లెట్లను ఉపయోగించడం వల్ల కేవలం తాత్కాలిక ప్రయోజనం మాత్రమే లభిస్తుంది అని గుర్తుంచుకోవాలి. అయితే సహజంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే కొన్నిరకాల సమస్యలను నయం చేయడానికి ఈ ఒక్క కషాయాన్ని తీసుకుంటే సరి పోతుంది.ఈ కషాయాన్ని తీసుకోవడానికి చాలా కష్టపడే అవసరం లేదు, కేవలం మనకు అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఈ కషాయాన్ని తయారు చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటికి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలలోకి వెళితే..

మనలో చాలా మంది ఉదయాన్నే నిద్రలేచి వారి పనులు చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు మార్నింగ్ రొటీన్‌ను పూర్తి చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఈ కషాయాన్ని తప్పకుండా ప్రయత్నించండి. సమయం లేకపోవడం వల్ల హడావుడిగా పనులు ముగించుకొని సరైన ఆహారాన్ని తీసుకోకుండా పనిలో పడిపోతుంటారు. ఇది అసలు మంచి పద్ధతి కాదు ఎందుకంటే, మీ రోజును చాలా పధ్ధతిగా ప్రారంభించి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇలాంటి కొన్ని మార్పులను మీ జీవితంలో చేసుకుంటే భవిష్యత్తులో చాలా మార్పులు మీకు మీరే చేసుకోగలుగుతారు.

రోజంతా కష్టపడి అలసిపోవడంతో ఉదయాన్నే నిద్రలేవడం కష్టమవుతుంది. దాంతో కొందరు సమయం లేక పోవడం వల్ల అల్పాహారాన్ని కూడా మానేస్తుంటారు మరికొందరైతే బయట ఆహారాన్ని ఎక్కువగా తింటారు. దాని వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరైన ఆహారం మరియు నిద్ర ఎంతో అవసరం.కాబట్టి మీ రోజును కొంచెం త్వరగా ప్రారంభించుకోండి. మార్నింగ్ రొటీన్‌లో భాగంగా చల్లని ధనియాల కషాయం తాగడం వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ఈ కషాయంలో కావలసినంత రాక్ షుగర్ ను కూడా కలుపుకోవచ్చు. ఈ కషాయాన్ని ఖాళీ కడుపున తాగడం వల్ల ఎసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్ వంటి జీర్ణప్రక్రియకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నిపుణులు తెలిపారు.

ధనియాలులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. వీటిలో అధిక శాతం ఫైబర్ ఉండటం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఎంతో మేలు చేసే గుణం ధనియాలులో ఉంటుంది అని చెబుతారు. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపున 40 నుండి 50 ml వరకు ధనియాల కషాయం తీసుకోవడం వల్ల జీర్ణప్రక్రియ సంబంధించిన సమస్యలు తో పాటు జ్వరం, అబ్డామినల్ పెయిన్, ఇన్ఫెక్షన్స్ మొదలగు సమస్యలు కూడా నయం అవుతాయి అని నిపుణులు చెబుతున్నారు. '

#healthy-lifestyle
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe