Cyclone Hamoon News: హమూన్ తుపాను ప్రభావం మొదలైంది. బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో క్రమంగా తుపాను బలపడుతోంది. దక్షిణ చిట్టగాంగ్‌లో ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్టు IMD అధికారికంగా ప్రకటించింది. ట్విటర్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.
అటు అరేబియా సముద్రంలో తేజ్ తుపాను (Cyclone Tej) కూడా క్రమంగా బలపడుతోంది. యెమెన్ తీర ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభావం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో, అరేబియా సముద్రంలో ఇలా ఒకేసారి రెండు తుపాన్లు బలపడడం కలవర పెడుతోంది. ఒడిశాతో పాటు పశ్చిమబెంగాల్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలతో పాటు తీరంలోని అన్ని ప్రాంతాల్లోనూ వానలు కురిసే అవకాశముందని IMD వెల్లడించింది.
Also Read: ‘కెప్టెన్సీ అంటే పూలపానుపు కాదు..’ చేతకాకపోతే తప్పుకో..!
ఆర్టీవీ తో విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద మాట్లాడుతూ.. హమూన్ తుపాను తీరం దాటిందని తెలిపారు. దక్షిణ కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈశాన్య రుతుపవనాల విస్తరణకు అనువైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.