Cyclone Hamoon: బీ అలర్ట్.. తీరం దాటిన తుపాను.! హమూన్ తుపాను తీరం దాటింది. దక్షిణ కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద RTVతో తెలిపారు. తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈశాన్య రుతుపవనాల విస్తరణకు అనువైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 25 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Cyclone Hamoon News: హమూన్ తుపాను ప్రభావం మొదలైంది. బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో క్రమంగా తుపాను బలపడుతోంది. దక్షిణ చిట్టగాంగ్‌లో ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్టు IMD అధికారికంగా ప్రకటించింది. ట్విటర్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. The Severe Cyclonic Storm “Hamoon” over Northeast Bay of Bengal lay centered at 2330 hours IST of 24th October about 420 km east-southeast of Digha (West Bengal), 150 km east-southeast of Khepupara (Bangladesh) and 80 km south-southwest of Chittagong (Bangladesh). — India Meteorological Department (@Indiametdept) October 24, 2023 అటు అరేబియా సముద్రంలో తేజ్ తుపాను (Cyclone Tej) కూడా క్రమంగా బలపడుతోంది. యెమెన్ తీర ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభావం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో, అరేబియా సముద్రంలో ఇలా ఒకేసారి రెండు తుపాన్లు బలపడడం కలవర పెడుతోంది. ఒడిశాతో పాటు పశ్చిమబెంగాల్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలతో పాటు తీరంలోని అన్ని ప్రాంతాల్లోనూ వానలు కురిసే అవకాశముందని IMD వెల్లడించింది. Also Read: ‘కెప్టెన్సీ అంటే పూలపానుపు కాదు..’ చేతకాకపోతే తప్పుకో..! ఆర్టీవీ తో విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద మాట్లాడుతూ.. హమూన్ తుపాను తీరం దాటిందని తెలిపారు. దక్షిణ కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈశాన్య రుతుపవనాల విస్తరణకు అనువైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. #telugu-states-weather-report మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి