ఆ రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్ష సూచన...!

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది. రాష్ట్రంలో ఈ రోజు చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. అదిలాబాద్, నిర్మల్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర భూపాల పల్లిలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

New Update
ఆ రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్ష సూచన...!

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలో ఈ రోజు చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. అదిలాబాద్, నిర్మల్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపలి,్ల ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణకేంద్రం తెలిపింది. అటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటనలో చెప్పింది.

తెలంగాణతో పాటు మధ్య ప్రదేశ్, కొంకణ్, గోవా, విదర్భం ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. అండమాన్ నికోబార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బిహార్, జార్ఖండ్, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ నెల 30,1 వ తేదీల్లో ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, బిహార్, జార్ఖండ్, ఒ డిశా, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, చండీగఢ్, యూపీ, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయా రాష్ట్రాల్లో ఈ రోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ పేర్కొన్నారు. తూర్పు భారత్ లో ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.

ఇక గుజరాత్ లో భారీ వర్షాలు కురిసినట్టు అధికారులు తెలిపారు. నవసరి ప్రాంతంలో (271మిమీ), సుబీర్ (196 మిమీ), బార్డోలీ (201మిమీ), జలాల్ పూర్ (186మిమీ), వల్సాద్ (182మిమీ), సంగద్ (179 మిమీ),ఉమర్ గామ్(167 మిమీ), పావీ జట్ పూర్ (175 మిమీ), బొడేలీ (146 మిమీ) వర్షం కురిసినట్టు ప్రకటనలో తెలిపారు. మహారాష్ట్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలో వర్షాలకు ఇప్పటి వరకు 102 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. మరో 13 మంది వరద నీటిలో కొట్టుకు పోయినట్టు అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు