దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా యూపీలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉదయం 9గంటలకే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. దీనికి తోడు వడగాల్పులు, దీంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. పాఠశాలల సెలవులు పొడిగించాలని రాష్ట్రప్రభుత్వాలను కోరే పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితిలో తాజాగా భారత వాతావరణ శాఖ కొన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న కొద్ది రోజుల పాటు కొన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి ఉంటుందని తెలిపింది.
వాతావరణశాఖ ప్రకారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుందనీ…దీనికి తోడు వేడిగాలులు వీయడంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని తెలిపింది. ఐఎండీ కొత్త బులెటిన్ లో వేడిగాలుల పరిస్ధితి, అది తగ్గే సమయం గురించి వివరించింది. దీంతోపాటు ప్రజలు ఎండల్లో వెళ్లకూడదని సూచించింది.
ఈ రాష్ట్రాల్లో ఎండల ప్రభావం:
జార్ఖండ్:
జూన్ 19 నుండి జూన్ 21 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండలు భారీగా ఉండనున్నాయి. వేడిగాలులు కూడా వీచే అవకాశం ఉంది. వేసవి సెలవులను జూన్ 21 వరకు పొడిగించింది ప్రభుత్వం.
ఛత్తీస్‌గఢ్ :
రానున్న మూడు రోజుల్లో కొన్ని చోట్ల వేడిగాలులు వీస్తాయి. దీంతో పలు జిల్లాల్లో వేడిగాలులు వీచే ఛాన్స్ ఉంది. ఛత్తీస్ గఢ్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు జంజ్ గిరి-చంపా జిల్లాల్లో నమోదు అయ్యాయి.
మహారాష్ట్ర:
విదర్భ ప్రాంతంలో రానున్న నాలుగు రోజుల్లో తీవ్ర వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్రలో పెరుగుతున్న వేడి కారణంగా, హీట్ స్ట్రోక్ కూడా సంభవించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఒడిశా:
రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.
తెలంగాణ:
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఏపీ:
అటు ఏపీలో రానున్న రెండు రోజుల్లో తీవ్రస్థాయిలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ తెలిపింది. ప్రస్తుతం వేడిగాలులు గ్రిల్ లో రాష్ట్రం ఉంది. రెండు రోజుల తర్వాత వాతావరణంలో స్వల్ప మార్పులు కనిపిస్తాయని ఐఎండీ తెలిపింది.
బీహార్:
పాట్నాతో సహా 24 నగరాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలో మార్పులు కనిపించాయి . పాట్నాలో గరిష్ట ఉష్ణోగ్రత 2.2 డిగ్రీల సెల్సియస్ తగ్గి 42.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. భోజ్‌పూర్ 45.3 డిగ్రీల సెల్సియస్‌తో రాష్ట్రంలోనే అత్యంత హాటెస్ట్ సిటీగా నిలిచింది.
పంజాబ్:
24 గంటల్లో, పాటియాలా జిల్లాలో 0.6 మిమీ, హోషియార్‌పూర్‌లో 0.5 మిమీ వర్షం కురిసింది. అమృత్‌సర్‌లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.