AP: కదిరిలో కొనసాగుతున్న కబ్జాలు.. పట్టించుకోని అధికారులు..! సత్యసాయి జిల్లా కదిరిలో కబ్జాదారుల ఆటలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారం మారినా, కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదంటూ స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. By Jyoshna Sappogula 13 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Ananthapur: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో కబ్జాదారులు కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మారినా కబ్జాదారుల ఆటలు కదిరిలో కొనసాగుతూనే ఉన్నాయి. అప్పనంగా కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఇంటి నిర్మాణంతో పాటు పునాదులు కూడా నిర్మించారు. Also Read: డిప్యూటీ సీఎం పవన్ నియోజకవర్గంలో పొలిటికల్ వార్.. టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు..! కదిరి రూరల్ మండలం ముత్యాల చెరువు గ్రామ పొలంలోని సర్వే నెంబర్ 87-2లో కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలం 0.30 సెంట్లు కబ్జా చేసి దర్జాగా పునాదులు కూడా నిర్మించేశారు. పట్టించుకోవాల్సిన రెవిన్యూ అధికారులు ఆ దిశగా అడుగు వేయకపోవడంతో కబ్జాదారులు రెచ్చిపోయి ప్లాట్లుగా విభజించి లక్షలకు అమ్మేశారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. #ananthapur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి