Ikea Hyderabad : హైదరాబాద్‎లో బ్రేక్‎ఈవెన్ కొడతాం...ఐకియా దూకుడు..!!

భారత రిటైల్ మార్కెట్లో మరింతగా విస్తరించేందుకు స్వీడన్ కు చెందిన ఫర్నీషింగ్ రిటైల్ కంకపెనీ ఐకియా ప్రయత్నిస్తోంది. దీనికోసం రెండెంచల వ్యూహంతో ముందుకు వెళ్తామని భారీస్థాయిలో స్టోర్లతో పాటు చిన్న స్టోర్లు, సిటీ స్టోర్లు కూడా ఏర్పాటు చేస్తామని ఐకియా ఇండియా సీఈవో సుసాన్ పుల్వీరర్ అన్నారు. హైదరాబాద్ స్టోర్ త్వరలో ఆపరేషనల్ బ్రేక్‌ఈవెన్‌ను సాధించడంలో దేశంలోనే నెంబర్ వన్ అవుతుందని తెలిపారు.

New Update
Ikea Hyderabad : హైదరాబాద్‎లో బ్రేక్‎ఈవెన్ కొడతాం...ఐకియా దూకుడు..!!

Ikea Hyderabad : స్వీడిష్ ఫర్నీచర్ తయారీదారు ఐకియా తన హైదరాబాద్ స్టోర్ త్వరలోనే ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ ను సాధించి దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుందని ఆ కంపెనీ సీఈవో సుసాన్ పుల్వీరర్ అన్నారు. 2018లో ప్రారంభించిన హైదరాబాద్ స్టోర్ గత 12నెలల కాలంలో మూడుమిలియన్లకు అడుగుపెట్టిందని తెలిపారు. అంతకుముందు ఏడాదికి 2.90మిలియన్లు వచ్చినట్లు వెల్లడించారు. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా గతేడాది ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదని..ఆ ఏడాదితో ఈ గణాంకాలు పోల్చదగినవి కావన్నారు.

ఇది కూడా చదవండి: AI‎తో ఉద్యోగాలకు ఎలాంటి భయం అక్కర్లేదు బ్రో: UNరిపోర్ట్

హైదరాబాద్ స్టోర్ ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గుర్గావ్, నోయిడా వంటి నగరాల్లో స్టోర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు తమకు ఇండియాలో ఐదు స్టోర్లు ఉన్నాయన్నారు. మరో ఒకటి రెండేళ్లలో బ్రేక్ ఈవెన్ సాధిస్తామని..హైదరాబాద్ స్టోర్ ను ఇప్పటివరకు 17.5 కోట్ల మంది సందర్శించినట్లు తెలిపారు. కాగా ఐకియా హైదరాబాద్ లో 9.500వరకు ప్రొడక్టులు అమ్ముతున్నట్లు వెల్లడించారు.

మాకు వచ్చే ఆదాయంలో ఆన్ లైన్ నుంచి 17శాతం వరకు ఉంది. ఇండియాలో 60 సప్లయర్స్ ఉన్నారు. ఇక్కడ మేము తయారు చేసిన టెక్స్ టైల్, కార్పెట్స్ , ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో కొన్నింటిని విదేశాలకు పంపిస్తున్నాము. లోకల్ సోర్సింగ్ ను 50శాతానికి పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇండియాలో మాకు 3వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 620మంది హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. స్టోర్లలో 70శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చాము. ఉద్యోగుల సంఖ్యను 10వేలకు పెంచాలని నిర్ణయించుకున్నామని సీఈవో సూజన్ పుల్వెలర్ అన్నారు. . రాబోయే సంవత్సరాల్లో 50 శాతానికి చేరుకోవాలనే ఆశయంతో స్థానిక సోర్సింగ్ కు ప్రధాన్యత ఇస్తోందని ఆమె తెలిపారు.

ఇది కూడా చదవండి:  లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్

Advertisment
తాజా కథనాలు