తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మెకానికల్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో ప్రాజెక్ట్ అసోసియేట్ , ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐఐటి కీలక ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం ఖాళీలు : 02
పోస్టులు : ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఆఫీసర్
విభాగాలు : మెకానికల్, ఆర్కిటెక్చర్
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 35 ఎళ్లు మించకూడదు.
జీతం : పోస్టులను బట్టి రూ.22,000 నుంచి 40,000 వరకు
దరఖాస్తు : ఈ-మెయిల్
ఈ-మెయిల్ : outsourcing_rect@iittp.ac.in
చివరి తేదీ: జూలై 25
వెబ్‌సైట్ : https://www.iittp.ac.in/
ఐఐటి హైదరాబాద్‌లో ఖాళీలు:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నానో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీ, నానో బయోటెక్నాలజీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ తదితర విభాగాలలో రిసెర్చ్ అసోసియేట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వివరాలు
* మొత్తం ఖాళీలు: 02
* రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు.
అర్హత: BE/ BTech/ MSc/ ME/ Ph.D.
వయసు: 30-40 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.47000.
ఎంపిక ప్రక్రియ: ఎంపిక షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇమెయిల్: ashok@mae.iith.ac.in
దరఖాస్తుకు చివరి తేదీ: 26.07.2023.
ISRO VSSC రిక్రూట్‌మెంట్
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)కు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), తాజాగా శాస్త్రవేత్త/ఇంజనీర్-SD, సైంటిస్ట్/ఇంజనీర్-SC ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ vssc.gov.inలో జులై 21 లోపు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌తో ISRO VSSC మొత్తం 61 ఖాళీలను భర్తీ చేయనుంది.