రోజంతా అలసి పోతున్నారా..అయితే దానికి ఇవే కారణాలు! మీరు రోజంతా నీరసంగా ఉంటున్నారా..ఏ పని చేయాలన్నా బద్ధంకంగా ఉంటుందా..అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నట్లే అవేంటో ఇప్పుడు చూద్దాం.. By Durga Rao 24 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి మనుషులకు చాలా ముఖ్యమైన వాటిలో నీళ్లు ఒకటి. ఎప్పుడైతే మీరు డీహైడ్రేట్‌కి లోనవుతారో అప్పుడు అలసిపోయినట్టు ఫీలవుతారు. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు బ్లడ్ వాల్యూమ్ తగ్గుతుంది, ఆక్సిజన్, న్యూట్రియంట్స్ శరీరానికి సరైన మోతాదులో అందవు. దీనివల్ల అలసిపోతారు. ఐరన్ లోపం వల్ల కేవలం నీరసం, అలసట మాత్రమే కాదు చిరాకుకి కారణమవుతుంది. శరీరంలో ఐరన్ తగ్గితే ఆక్సిజన్ కండరాలు, కణాలకు తక్కువగా అందుతుంది. అలాగే అనీమియాకి దారితీస్తుంది. కాబట్టి కిడ్నీ బీన్స్, ఎగ్స్, గ్రీన్ వెజిటబుల్స్, నట్స్ తీసుకోవడం మంచిది. మనందరికీ తెలుసు బ్రేక్ ఫాస్ట్ ఎంత అవసరమో. మెటబాలిజంను పెంచడానికి బ్రేక్ ఫాస్ట్ సహాయపడుతుంది. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే చాలా అలసటగా అనిపిస్తుంది. మంచి ఫ్యాట్, ప్రొటీన్స్ ఉన్న బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. 2 స్లైస్‌ల వోల్ వీట్ బ్రెడ్, ఒక గ్లాసు స్కిమ్డ్ మిల్క్ తీసుకుంటే మంచిది. ఉదయం నిద్రలేవగానే జిమ్, వాకింగ్ ఏదో ఒకటి చేయడం వల్ల చాలా ఫ్రెష్‌గా ఫీలవుతారు. వర్కవుట్ చేయడం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయి రోజంతా ఎనర్జిటిక్‌గా ఫీలవుతారు. వర్క్ గురించి ఎక్కువగా చింతించడం, ఒత్తిడికి లోనవడం, ఎక్కువ సమయం పనిచేయడానికి టైం స్పెండ్ చేయడం వల్ల మీరు అలసిపోతారు. ఒత్తిడి సైలెంట్ కిల్లర్ అని మరిచిపోకండి.మీరు ఎల్లప్పుడూ మీ ఫోన్, ఈమెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటారా ? ఎక్కువగా స్క్రీన్ చూడటం వల్ల మీ నిద్రపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల మీరు ఎక్కువగా అలసిపోతున్నట్టు ఫీలవుతారు. #best-health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి