సరదాగా సాగుతున్న చాట్ లో హార్ట్ ఎమోజీని పంపించారంటే మాత్రం డైరెక్ట్ గా రెండేళ్ల పాటు కటకటాల వెనక్కే. అంతే కాదు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా..5,35,825 రూపాయలు జరిమానా చెల్లించాల్సిందే. అయ్యా బాబోయ్.. ఇదేంటీ.. ఇదెక్కడా అని అనుకుంటున్నారా.. కఠినమైన రూల్స్ కు కేరాఫ్ అయిన కువైట్ లో. అమ్మాయిలతో చాట్ చేస్తున్న క్రమంలో సోషల్ మీడియా లేక వేరే ప్లాట్ ఫామ్ లో అయినా కాని వారికి అబ్బాయిలు హార్ట్ ఎమోజీని పంపించారంటే మాత్రం అడ్డంగా బుక్ అవుతారు.
అలా హార్ట్ ఎమోజీలను పంపిన వారు తీవ్రమైన శిక్షను ఎదుర్కొంటారని అక్కడి మీడియా తాజాగా వెల్లడించింది. దీంతో కువైట్ లో ఎవరైనా.. ఎవరికైనా హార్ట్ ఎమోజీని పంపితే రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రెండు వేల కువైట్ దినార్లు జరిమానాను అక్కడి ప్రభుత్వం విధిస్తోంది.ఇక ఈ విషయంలో కువైట్ ను సౌదీ అరేబియా కూడా ఫాలో అవుతోంది. అలా సోషల్ మీడియాలో హార్ట్ ఎమోజీలను పంపడం అభ్యంతరకరమని సౌదీ అరేబియాలోని నివేదికలు చెబుతున్నాయి. దీంతో రెడ్ కలర్ హార్ట్ ఎమోజీని పంపితే సౌదీ.. కువైట్ కన్నా ఇంకా కఠినంగా శిక్షలు విధిస్తోంది.
సౌదీ యాక్ట్ ప్రకారం.. ఈ నేరం రుజువైతే మాత్రం నిందితుడికి రెండేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. దీంతో పాటు వెయ్యి సౌదీ రియాల్స్ జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో ఈ జరిమానా ఎంతో తెలుస్తే.. అమ్మాయిలకు హార్ట్ ఎమోజీ పంపించడం పక్కన పెడితే.. అబ్బాయిల గుండె ఆగిపోతుంది. 21 లక్షల 93 వేల 441 రూపాయలు. మరి అమ్మాయికి ఒక్క హార్ట్ ఎమోజీని పంపిస్తే.. ఇంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిసి కూడా సాహసం చేసే వాళ్లు చాలా తక్కువ మంది అబ్బాయిలే ఉంటారు.
అయితే వాట్సాప్ చాట్ లో హార్ట్ సింబల్ ను పంపించడం సో కామన్. ఇష్టాన్ని ఎక్స్ ప్రెస్ చేయడానికి దీన్ని వాడుతుంటారు. ఇక వాట్సాప్ లోనే ఎక్కువగా గడిపే యూత్ అయితే తమకు నచ్చిన వారికి అదే విధంగా ప్రేమను తెలపడానికి రెడ్ కలర్ హార్ట్ ఎమోజీని ఎక్కువగా అమ్మాయిలకు పంపుతుంటారు. మరి కువైట్, సాదీలో దీన్ని బ్యాన్ చేయడంతో పాటు విధిస్తున్న శిక్షలను తెలిసి వారి హార్ట్ బీట్ పెరిగిపోతుంది.