iPhone Brand : ఐఫోన్(iPhone) ఈ బ్రాండ్‌కు ఉండే క్రేజే వేరు. యూత్ ఎప్పుడెప్పుడు ఈ ఫోన్ కొందామా అని తెగ ఎదురుచూస్తుంటారు. వీరితో పాటు సెలబ్రిటీలు(Celebrities), పొలిటికల్ లీడర్లు(Political Leaders), స్పోర్ట్స్ స్టార్లు(Sports Stars) ఇంకా ఎందరో లక్షల రూపాయలు పెట్టి మరీ ఐఫోన్లను కొంటూ ఉంటారు. ఎందుకంటే ఇది డిజైన్ పరంగా.. క్వాలిటీ.. సెక్యూరిటీ, సేఫ్టీ ఇంకా ఇతర ఎన్నో ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్‌తో పోల్చి చూస్తే యాపిల్ ఫోన్లో ఆప్షన్లు ప్రత్యేకంగా ఉంటాయి. సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందీ ఉండదని చాలా మంది నమ్ముతారు. యాపిల్ ఫోన్‌ను ఎవ్వరూ హ్యాకింగ్ చేయలేరని నమ్మకంతో ఉంటారు. అయితే యాపిల్ ఇటీవల భారతదేశంలోని రాజకీయ నాయకులను, 150 ఇతర దేశాలలోని వ్యక్తులను సైబర్ అటాక్స్ గురించి హెచ్చరించింది. తమ డివైజ్‌లను రక్షించుకోవడానికి లాక్డౌన్ మోడ్ ఆన్ చేసుకోవాలని యాపిల్ కంపెనీ సూచించింది.
మరోవైపు కొన్ని మాల్వేర్ వైరస్లు, కొన్ని ట్రిక్స్‌తో హ్యాకర్ల టీమ్స్ యాపిల్ ఫోన్‌ను సైతం హ్యాకింగ్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఐఫోన్ యూజర్లు చేసే కొన్ని పొరపాట్ల వల్ల వ్యక్తిగత సమాచారం కోల్పోవాల్సి రావొచ్చు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..
iPhone Hack : ఈ పొరపాట్లు చేస్తే పక్కాగా ఐఫోన్ హ్యాక్!
ఐఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ ఫోన్ కంటే యాపిల్ ఫోనే చాలా సేఫ్ అని నమ్ముతారు. అయితే ఐఫోన్లో మీరు చేసే చిన్న పొరపాట్ల వల్ల మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారిగా హ్యాకర్ల చేతికి వెళ్తుందట. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Translate this News: