WEIGHT LOSS : ఈ టిప్స్ ఫాలో అవ్వండి..బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోండి!

బెల్లీ ఫ్యాట్ పేరుకుపోవడం వల్ల చూడ్డానికి అంత బాగోదు. అందుకే, దీనిని తగ్గించుకునేందుకు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వొచ్చు. వీటి కారణంగా బరువు తగ్గడం, బెల్లీ తగ్గడం ఈజీ అవుతుంది. అవేంటో తెలుసుకోండి.

WEIGHT LOSS : ఈ టిప్స్ ఫాలో అవ్వండి..బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోండి!
New Update

నేటి కాలంలో బరువు పెరగడం చాలా పెద్ద సమస్య. దీనిని తగ్గించేందుకు కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. వీటి కారణంగా బరువు తగ్గడం, బెల్లీ తగ్గడం ఈజీ అవుతుంది. అసలు బరువు ఎందుకు పెరుగుతారంటే సరిలేని లైఫ్‌స్టైల్, ఫుడ్, హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్, శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు, బెల్లీ పెరుగుతుంది. దీని కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.

ఆరోగ్య నిపుణుల ప్రకారం, మహిళల్లో బెల్లీ ఫ్యాట్ పేరుకుపోవడానికి హార్మోన్ల అసమతుల్యత ముఖ్య కారణం. అలాగే బాడీలో ఇన్సులిన్ సెస్సెటివిటీ తగ్గుతుంది. దీని కారణంగా బాడీలో కొవ్వు పేరుకుపోతుంది. దీని కారణంగా ఆడవారిలో థైరాయిడ్, గుండె జబ్బులు, పిసీఓఎస్, పీసీఓడి వంటి సమస్యలు వస్తాయి.

ఆడవారు బెల్లీని ఎలా తగ్గించుకోవాలనేది ముఖ్య ప్రశ్న. ఇతర భాగాల్లో బరువు ఈజీగా తగ్గుతుంది. కానీ, బెల్లీ తగ్గడం కాస్తా కష్టమవుతుంది. ఇలాంటప్పుడు ఆడవారు ఇబ్బంది పడతారు. ఎందుకంటే, ఆడవారిలో బెల్లీ తగ్గడం అంత ఈజీ కాదు. అలా అని అసాధ్యం కూడా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అందులో వర్కౌట్, రెండోది మంచి డైట్. అందులో ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం.

ఉదయం లేవగానే పరగడపున గోరువెచ్చని నీరు తాగాలి. దీని వల్ల క్యాలరీలు కరిగిపోతాయి. దీని వల్ల జీర్ణక్రియ, జీవక్రియ సరిగ్గా అవుతుంది.రోజుకి ఓ అరగంటైనా వర్కౌట్ చేయాలి. దీనికోసం యోగా, డ్యాన్స్, వాకింగ్ వంటివి రోజుకి కనీసం 30 నిమిషాల నుండి 40 నిమిషాలైనా చేయాలి. దీని వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి.హెల్దీ బాడీకి మంచి నిద్ర చాలా ముఖ్యం. బరువు తగ్గాలనుకుంటే ముందుగా సమాయానికి పడుకోవడం, లేవడవ చేయండి. బాడీకి రెస్ట్ చాలా ముఖ్యం. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. దీని వల్ల బాడీ కోలుకుంటుంది.

#tips #lose-weigh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి