/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/money-11-jpg.webp)
అందరికీ లక్ష్యాలు ఉంటాయి. వాటిని నెరవేర్చే దిశగా ప్లానింగ్స్ రూపొందించుకుంటారు. కానీ తక్కువ కాలంలో తీరే లక్ష్యాలు కొన్ని ఉంటే..ఎక్కువ సమయం పట్టేవి కొన్ని ఉంటాయి. రెండింటికీ సరిపోయే స్ట్రాటజీని రూపొందించుకోవడం చాలా కీలకం. అయితే చాలా మందికి కోట్లు సంపాదించాలన్న కోరిక ఉంటుంది. కానీ ప్రతినెలా మొత్తాన్ని జమ చేయడం సులభం కాదు. ఇలాంటి లక్ష్యాలను క్రమశిక్షణతో కూడిన క్రమబద్ధమైన విధానమైన సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ద్వారా నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. సిప్ లు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి నిర్మాణాత్మక క్రమశిక్షణ పద్దతిని అనుసరిస్తాయి.
ఉదాహరణకు 12శాతం వార్షిక రాబడితో నెలవారీ రూ. 30, 000 పెట్టుబడితో రూ. 1కోటి సంపాదించడానికి దాదాపు 12ఏళ్లు పడుతుంది. అదే రూ. 3కోట్లు అయితే 20ఏళ్లు పడుతుంది. అయితే ప్రతిఏడాది నెలవారీ సిప్ అమౌంట్ ని 10శాతం పెంచితే పదేళ్లలో రూ. కోటి, 16ఏళ్లలో 3కోట్లను పొందవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ రిపోర్టు ప్రకారం రూ. 10వేల పెట్టుబడితో కోటి ఎలా సంపాదించాలో ఫండ్స్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం తెలుసుకుందాం.
సిప్ వర్సెస్ లంప్ సమ్:
సాధారణంగా పెట్టుబడిదారులు ఎదుర్కొనే ఆపదల నుంచి సిప్ లు రక్షిస్తాయి. లంప్ సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మార్కెట్లో నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ రిస్కును భరించాల్సి వస్తుంది. సిప్ లో అయితే నిర్ణీత మొత్తాన్ని నెలవారీ లేదా త్రైమాసిక వ్యవధిలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ క్రమబద్ధమైన విధానం మార్కెట్లో అస్థిరతలతో ఎదురయ్యే నష్టాలను దాదాపు తగ్గిస్తుంది. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లను కూడబెట్టుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. దీంతో లోయర్ యావరేజ్ కాస్ట్ తో హయ్యర్ రిటర్న్స్ పొందే ఛాన్స్ కూడా ఉంటుంది.
ప్రతినెలా సిప్ :
ప్రతినెల పదివేల సిప్ చేస్తూ 12శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంచనా వేస్తే ఐదేళ్ల 10 నెలల్లో పది లక్షలు, తొమ్మిదేళ్ల 2 నెలల్లో రూ. 20లక్షలు, 11ఏళ్ల 7 నెలల్లో 30లక్షలు, 15ఏళ్లలో 50లక్షలు, 17ఏళ్ల 11నెలలకు 75లక్షలు సంపాదించవచ్చు. ఇరవై ఏళ్లలో కోటికి చేరుతుంది. ఏటా సిప్ చేసే మొత్తాన్ని పది శాతం పెంచుతే ఇంకా త్వరగా కోటి రూపాయలు సంపాదించవచ్చు.