తులసి మొక్కను హిందువులు దేవతగా పూజిస్తారు. దేవతగానే కాదు..అనేక వ్యాధులకు చెక్ పెట్టే దివ్యౌషధంగానూ తులసి ఎంతో ముఖ్యమైంది. ఆయుర్వేదంలోని అనేక ఔషధాలు, మూలికలు తులసి మిశ్రమంతో తయారుచేస్తారు. ఇది శీతాకాలం కూడా ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.మారుతున్న వాతావరణం కారణంగా చాలా మంది జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కానీ రోజూ ఉదయాన్నే తులసి నీళ్లను తాగితే మీ శరీరం రోగాల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది.
బ్లడ్ షుగర్ లెవెల్:
చలికాలం ఎన్నో వ్యాధులకు కారణం అవుతుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి వ్యాధులు ఈ సీజన్ లో సాధారణమే. అయినప్పటికీ ఆస్తమా పేషంట్లు ఈ కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారం పట్ల మరింత జాగ్రత్త అవసరం. ఈ సీజన్ లో శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే షుగర్ పేషంట్లు ప్రతిరోజూ ఉదయాన్నే తులసి నీటిని తాగుతే మీ రక్తంలోని చక్కెర కంట్రోల్లో ఉంటుంది.
జలుబు, దగ్గు:
చలికాలంలో దగ్గు, జలుబు సమస్యలు సాధారణమ. అయినప్పటికీ దగ్గ వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే ప్రతిరోజూ తులసి నీటిని తాగాలి. అంతేకాదు సీజనల్ వ్యాధులను నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
ఎసిడిటీ:
ఎసిడిటి, కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తులసి నీటిని తాగుతే మంచి ప్రయోజనాలు పొందుతారు.
చర్మ సంబంధిత సమస్యలు:
చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు తులసి నీరు ఎంతో మేలు చేస్తుంది. ఇది ముఖంపై మచ్చలు మరియు మొటిమలను తొలగించడంలో చాలా సహాయపడుతుంది.
మోకాళ్ల నొప్పులు:
చలికాలంలో మోకాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు ఎక్కువగా వేధిస్తుంటాయి. వాటి నుంచి తక్షణమే ఉపశమనం పొందాలంటే తులసి నీటిని తాగాలి. అంతేకాదు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలకు కూడా తులసి నీరు చెక్ పెడుతుంది.
ఇది కూడా చదవండి : రాత్రిపూట నోరు తెరిచి నిద్రపోతున్నారా? అయితే మీ పని ఫసక్…!!