Health: ఈ టీ తాగండి..బరువు తగ్గండి! బరువు తగ్గాటానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాము. కొందరికి జిమ్ కి వెళ్లే తీరిక కూడా ఉండకపోవచ్చు.మరికొందరికి ఏం చేసిన రిజల్ట్ మాత్రం కనపడదు. కాని ఈ టీ తాగటం ప్రారంభించిన ద్వారా మీకు రిజల్ట్ వెంటనే తెలుస్తుంది. By Durga Rao 02 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి అల్లం, పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి వంట రుచిని పెంచడానికి మాత్రమే కాదు. అనేక సమస్యలకి పరిష్కారంగా వాడతారు. వీటిని వాడినప్పుడు ఎన్నో సమస్యలు తగ్గుతాయి. షుగర్, జలుబు, వికారం, కీళ్ళనొప్పులు మొదలైన లక్షణాలను తగ్గిస్తుంది. వేడి నీరు, పాలలో అల్లం ముక్క, కొద్దిగా పసుపు వేసి వాటిని తాగితే శరీరానికి ఔషధ గుణాలు అందుతాయి. శరీరంలో ముఖ్యమైన లివర్‌ని డీటాక్స్ చేయడానికి పసుపు, అల్లం టీ తాగాలి. దాని వల్ల కలిగే ఐదు ప్రయోజనాలను తెలుసుకోండి.అల్లం జీర్ణక్రియకి చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇది జీర్ణ ఎంజైమ్స్‌ని, వికారాన్ని తగ్గిస్తుంది. పసుపు జీర్ణవ్యవస్థని మెరుగ్గా చేస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అల్లం, పసుపులో పవర్‌ఫుల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అల్లంలో జింజెరాల్, పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇవి రెండు కూడా బాడీలో మంటను తగ్గించి ఆర్థరైటీస్ లక్షణాలను తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడతాయి.బాడీలో ఇమ్యూనిటీ బలంగా ఉంటే ఆరోగ్య సమస్యలు దూరమవ్వవు. అల్లం, పసుపులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడానికి పనిచేస్తాయి. ఉదయాన్నే అల్లం, పసుపు టీ తాగడం మంచిది. ఆడవారికి పీరియడ్స్ టైమ్‌లో చాలా సమస్యలు ఉంటాయి. ఇందులో కడుపు నొప్పి, తిమ్మిర్లు, వెన్నునొప్పి వంటి సమస్యలు ఉన్నాయి. వీటిని తగ్గించేందుకు ఓ కప్పు అల్లం, పసుపు టీ తాగితే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు.అందరు కోరుకునేది ఇదే. బరువు తగ్గించడంలో అల్లం, పసుపు టీ ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. అందుకోసం రోజూ పసుపు, అల్లం టీ తాగితే పసుపులోని కర్కుమిన్ జీవక్రియని పెంచి వాపుని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అల్లం ఆకలిని తగ్గిస్తుంది. ఇందుకోసం ఈ టీ పరగడపున తాగితే బరువు తగ్గుతారు. #health #weight-loss-tea మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి