రూ.11,000 ధర తగ్గిన శాంసంగ్ 5G మొబైల్.. రూ.1,188కి సొంతం చేసుకోండి!

మీరు శాంసంగ్ మొబైల్ 5G మోడల్ కొనాలని అనుకుంటూ ఉంటే.. ఈ ఆఫర్ మీకు బాగా నచ్చుతుంది. ఏకంగా 11 వేల రూపాయలు ధర తగ్గడం గొప్ప విషయమే కదా. పూర్తి వివరాలు తెలుసుకొని, కొనాలో వద్దో నిర్ణయం తీసుకోండి.

రూ.11,000 ధర తగ్గిన శాంసంగ్ 5G మొబైల్.. రూ.1,188కి సొంతం చేసుకోండి!
New Update

ఇది శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లోని A34 5G ఆసమ్ వయలెట్ మోడల్ 8GB RAM, 128GB స్టోరేజ్ మొబైల్. దీనికి పవర్‌ఫుల్ గొరిల్లా గ్లాస్ ఉంది. వాయిస్ ఫోకస్ ఉంది. నీటిలో పాడవకుండా IP67 రేటింగ్ ఉంది.ఈ మొబైల్‌కి 48MP(OIS)+8MP+5MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వెనకవైపు OISతో 48MP (F1.8) మెయిన్ కెమెరా+ 8MP (F2.2) అల్ట్రా వైడ్ కెమెరా + 5MP (F2.4) డెప్త్ కెమెరా ఉండగా.. ముందుభాగంలో 13MP (F2.2) సెల్ఫీ కెమెరా ఉంది. నైట్ ఫొటోగ్రఫీ, AI రీమాస్టర్, ఆబ్జెక్ట్ ఇరేజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ మొబైల్ 6.6 అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సెల్స్ FHD+ రిజల్యూషన్, 16 మిలియన్ కలర్స్‌తో 393 PPI కలిగివుంది.ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌తో ఆపరేట్ అవుతోంది. అలాగే మీడియా టెక్‌ D1080 2.6GHz, 2GHz ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.ఈ మొబైల్‌కి 5000 mAh రిమూవ్ చెయ్యలేని బ్యాటరీ ఇచ్చారు. వేగంగా ఛార్జ్ అవుతుందని తెలిపారు. దీనికి USB టైప్ C ఛార్జర్ అవసరం. ఈ మొబైల్ 1000 nits(HBM) స్క్రీన్ కలిగివుంది. అందువల్ల ఎండలో కూడా స్క్రీన్ బాగా కనిపిస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ 198 గ్రాముల బరువు ఉంది. ఇది బ్లూటూత్, వైఫై, USBతో కనెక్ట్ అవుతుంది. ఇంకా ఇందులో రెండు సిమ్‌లు పడతాయి. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, మొబైల్ హాట్‌స్పాట్, బిల్టిన్ GPS వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. బాక్సులో మొబైల్‌తోపాటూ USB కేబుల్ ఇస్తున్నారు.అమెజాన్‌లో దీనికి 4.1/5 రేటింగ్ ఉంది. గత నెల రోజుల్లో ఈ మొబైల్‌ని 200 మందికి పైగా కొనుక్కున్నారు. అలాగే ఈ మొబైల్‌కి 2026 మంది రివ్యూ ఇచ్చారు. దాని ప్రకారం ఈ మొబైల్ డిస్‌ప్లే, క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ చాలా బాగున్నాయి. కెమెరా క్వాలిటీ, బ్యాటరీ లైఫ్, పెర్ఫార్మెన్స్, వాల్యూ, చార్జింగ్ స్పీడ్ పర్వాలేదు. మైనస్ మార్కులు లేవు.

దీని అసలు ధర రూ.35,499 కాగా.. అమెజాన్‌లో దీనిపై 31 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.24,499కి అమ్ముతున్నారు. మీరు దీన్ని EMIలో 1,188కి పొందవచ్చు.

#samsung-galaxy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe