Relationship: ఇలా జరుగుతుంటే జాగ్రత్తగా ఉండండి.. లేకపోతే మీ లవ్ ఫసక్కే!

New Update
Relationship: లేడీస్, మీ భర్త మీ మాట అస్సలు వినకపోతే, ఈ చిట్కాలు ప్రయత్నించండి..!!

కొన్ని రిలేషన్‌షిప్స్‌ చాలా కాలం కంటిన్యూ అవుతాయి.. మరికొన్ని స్టార్టింగ్‌ ఫేజ్‌లోనే ఆగిపోతాయి. మరికొన్ని ఎప్పుడు ఎండ్‌ అవుతాయో.. మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు. రిలేషన్‌ షిప్‌ ఎండ్‌ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి.. ఇది అబ్బాయి లేదా అమ్మాయి సైడ్‌ నుంచి ఉన్న మిస్టేక్ కావొచ్చు.. లేకపోతే ఇద్దరి మిస్టేక్ కావొచ్చు.. ఇక ఎవరి మిస్టేక్‌ లేకుండా కూడా కొంతమంది ఎందుకో బ్రేక్ అప్‌ చెప్పుకుంటారు. అయితే మనం రిలేషన్‌షిప్‌లో ఫెయిల్‌ అవబోతున్నామని ముందుగానే తెలుసుకోవచ్చు.,

publive-image ప్రతీకాత్మక చిత్రం

మాటలు తగ్గాయి:
కమ్యూనికేషన్ బ్రేక్‌డౌన్ అయ్యిందా? రెగ్యులర్‌గా మాట్లాడుకోవడం లేదా? గతంలో లాగా మాటలు లేవా? అర్ధవంతమైన కమ్యూనికేషన్ తగ్గడం మొదలవడం లేదా తక్కువ మాట్లాడటం, ముఖ్యమైన సంభాషణలను నివారించడం లాంటి భావం ఉంటే జాగ్రత్త వహించండి. మీరు మీ భాగస్వామి నుంచి మానసికంగా దూరం అవుతున్నారని భావిస్తుంటే అది మీ రిలేషన్‌కి ఎండ్‌ కార్డ్‌ లాగా అనుకోవచ్చు. ఒకరి భావాలను పరస్పరం అర్థం చేసుకోవడం, కనెక్షన్ లేకపోవడం రిలేషన్‌ ఎండ్‌కి సంకేతాలు. శారీరక సాన్నిహిత్యం తగ్గడం కూడా దీనికి సూచన. తగినంత సమయం గడపడం కూడా ముఖ్యం. కలిసి సమయాన్ని గడపడం, షేర్ చేసిన క్షణాల కంటే ఇతర కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వడం వారి ఇంపార్టెన్స్‌లో మార్పును సూచిస్తుంది. నిరంతర వాదనలు కూడా కరెక్ట్ కాదు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

గొడవలు వద్దు:
పరిష్కారం లేకుండా తరచుగా గొడవలు పడడం పెరుగుతున్న నిరాశను సూచిస్తాయి. గోప్యత పెరుగుదల లేదా పారదర్శకత లోపించినట్లయితే.. ఇది ట్రస్ట్ ఇష్యూస్‌కి కారణం కావొచ్చు వ్యక్తిగత లక్ష్యాలు, ప్రాధాన్యతలలో గుర్తించదగిన మార్పులు, సంబంధాన్ని తక్కువ పరిగణనలోకి తీసుకుంటే అవి రిలేషన్‌షిప్‌ ఇబ్బందులను సూచిస్తాయి. సంబంధంలో మీకు సపోర్ట్‌ లేదని లేదా మీ అవసరాలను తీర్చలేకపోవడం కూడా రిలేషన్‌షిప్‌ ఫెయిల్యూర్‌కు దగ్గర పడిందని సూచన కావొచ్చు..

గుర్తుపెట్టుకోండి.. నిజానికి రిలేషన్‌షిప్‌ స్టెటస్‌ అన్నది ఏ ఇద్దరి మధ్య ఒకలాగే ఉండదు.. రిలేషన్‌పిప్‌ ఫెయిల్ లేదా సక్సెస్‌ అన్నది ఇలాంటి కారణాలతోనే జరుగుతాయని ఎలాంటి ఆధారాలు లేవు. ఈ ఆర్టికల్‌ కేవలం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగానే ఇవ్వబడింది.

Also Read: టీమిండియా పాలిట శని.. ఆ అంపైర్‌ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా గెలవలేదు..!

Advertisment
తాజా కథనాలు