చుండ్రు సమస్య మరీ ఎక్కువగా ఉంటే.. ఈ పద్దతులు ఫాలో అయిపోండి..!

చుండ్రు చిన్న సమస్యగానే కనిపిస్తుంది. కానీ దాన్ని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసి విఫలమవుతున్న వారిని చూస్తూనే ఉంటాం. అయితే షాంపూల అవసరం లేకుండా చుండ్రును దూరం చేసేందుకు కొన్ని చిట్కాలున్నాయి.అవేంటో చూసేద్దాం రండి!

New Update
చుండ్రు సమస్య మరీ ఎక్కువగా ఉంటే.. ఈ పద్దతులు ఫాలో అయిపోండి..!

మనిషి అందానికి కేశాలు (hair) కూడా ముఖ్యమే. కానీ, సగటు జీవిలో జుట్టు రాలిపోతుండటాన్ని చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని (beauty) రెట్టింపు చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్​ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం(fall) జరుగుతుంది. అయితే నల్లని ఒత్తైన జుట్టు (hair) ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు.

అంతేకాకుండా ఉద్యోగపరమైన ఒత్తిడి, మానసిక ఆందోళనలు వలన తెల్ల జుట్టు (white hair) చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తుంది. వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ (Products) కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (beauty tips) మంచి ఫలితాలను ఇస్తాయి.ఒకప్పుడు ప్రకృతిలో దొరికే శీకాయ, కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారు. ప్రతివారం నూనె (oil)తో తలస్నానం చేయడం వల్ల అందమైన జుట్టు (hair) అందరికీ ఉండేది. చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె అప్లై (apply) చేయరు.

వారంలో రెండు రోజులు తలకు ఆలివ్‌ ఆయిల్‌ (Olive oil)తో మసాజ్‌ చేయాలి. ఆలివ్‌ ఆయిల్‌లో సహజసిద్ధంగా చుండ్రును తొలగించే గుణాలున్నాయి.నిమ్మ ఆకులను అరగంట పాటు నీళ్లలో మరిగించాలి. తరువాత ఆ ఆకులను పేస్ట్‌ మాదిరిగా చేసి తలకు పట్టించాలి. నలభైనిమిషాల తరువాత శుభ్రంగా కడుక్కోవాలి.అలోవెరాలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలుంటాయి. ఇవి చుండ్రును సమర్ధవంతంగా తొలగిస్తాయి. తలకు అలోవెరా జెల్‌ను పట్టించి నలభై నిమిషాల తరువాత కడుక్కుంటే చుండ్రు సమస్య దూరమవుతుంది.మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పేస్ట్‌ మాదిరిగా చేసుకుని తలకు పట్టించాలి. అరగంటపాటు అలా వదిలేసి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేయాలి.

Advertisment
తాజా కథనాలు